A Man killed Wife in Vijayawada :డబ్బు డబ్బు నువ్వు ఏం చేస్తావు అంటే ప్రాణ మిత్రుల్ని విడగొడతాను. తండ్రీకుమారుల మధ్య చిచ్చు పెడతాను. మనుషులు విచక్షణ కోల్పోయేలా చేసి బంధాలు తెంచేస్తానని చెబుతుంది అనేది ఓ సినిమాలోని డైలాగ్. ఈ ఘటన చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. డబ్బుల విషయంలో దంపతుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. ఈ దారుణ ఘటన విజయవాడలో సంచలనం సృష్టించింది.
డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో భార్య పీక కోసి హతమార్చాడు ఓ భర్త. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ కంసాలిపేటకు చెందిన షేక్ బాజీ, నగీన(32)లకు 11 సంవత్సరాల కిందట వివాహమైంది. వారికి ఓ కుమారుడు. భర్త పెయింటింగ్ పని చేస్తుండగా, భార్య స్థానికంగా సమోసాల తయారీ కేంద్రంలో పని చేస్తుంది. షేక్ బాజీ మద్యానికి బానిసై పనికి సరిగా వెళ్లేవాడు కాదు. తరచూ అప్పులు చేస్తూ భార్యను డబ్బులు ఇవ్వాలంటూ వేధించసాగాడు.
ఇలా షేక్ బాజీ స్పిరిట్, సొల్యూషన్ తాగేందుకు అలవాటు పడ్డాడు. నాలుగు రోజుల కిందట రూ.5,000 కావాలని భార్యను అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత నగీన పక్కవీధిలో ఉండే అక్క సాబీర దగ్గరకు వెళ్లింది. సాయంత్రం పని అయిపోగానే ఇంటికి వెళ్లి రాత్రి పూట నిద్రించేందుకు అక్క దగ్గరకు వస్తుంది. ఈ క్రమంలో ఈ నెల 21న తెల్లవారుజామున 4 గంటలకు పనికి వెళ్లిన నగీన ఓ గంట విశ్రాంతి సమయం ఉండడంతో ఉదయం 8 గంటలకు ఇంటికి వచ్చింది.