ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లోకేశ్ ప్రజాదర్బార్​లో వెల్లువెత్తే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం - Nara Lokesh Praja Darbar - NARA LOKESH PRAJA DARBAR

నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మంత్రి లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ కష్టాల్లో ఉన్న వారికి స్వాంతన కలిగిస్తోంది. సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలకు వెంటనే భరోసాతో పాటు వారికి మనోధైర్యం కల్పించే చర్యలకు దిగుతున్నారు. సమస్యపై వెంటనే స్పందించే విధంగా యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు.

Nara Lokesh Praja Darbar
Nara Lokesh Praja Darbar (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 18, 2024, 2:57 PM IST

Nara Lokesh Praja Darbar : గుంటూరు జిల్లామంగళగిరి ప్రజల కోసం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న 'ప్రజాదర్బార్'కు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజాదర్బార్ కష్టాల్లో ఉన్న వారికి స్వాంతన కలిగిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకే వందలాది మంది ప్రజలు వినతిపత్రాలతో ఇంటివద్ద బారులు తీరుతున్నారు. మంగళగిరి ప్రజలను తమ కుటుంబసభ్యులుగా భావించే లోకేశ్ ప్రతిఒక్కరి సమస్యను వింటూ నేనున్నానని భరోసా ఇస్తున్నారు.

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం : ప్రజాదర్బార్​లో నారా లోకేశ్​ను ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కలిశారు. తమపై పెట్టిన కేసులు రద్దు చేయాలని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ప్రజా సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఆయాశాఖల అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు.

100 రోజుల్లో రాష్ట్రంలో గంజాయి విక్రయాలకు చెక్‌ పెడతాం: మంత్రి లోకేశ్​ - Minister Lokesh in Bakrid Prayer

సీఎం నివాసంలో మంత్రి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివసించే ఉండవల్లి నివాసంలోనే లోకేశ్ ఉంటున్నారు. సాధారణంగా సీఎం నివాసం వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఉంటుంది. అయితే చంద్రబాబు నివాసం వద్ద ప్రజలకు ఎటువంటి ఆంక్షలు లేవు. గతంలో జగన్ మోహన్ రెడ్డిని నివాసం వద్ద అయితే దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డునే బ్లాక్ చేసిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. వందల మంది ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు ఉండవల్లి నివాసానికి విచ్చేసినప్పటికీ ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుంచి నారా లోకేశ్ ప్రతి ఒక్కరినీ కలుసుకుని వారి సమస్యలు వింటున్నారు. మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని, ఎన్నికల సమయంలో చెప్పిన మాటను ప్రజాదర్బార్ ద్వారా నిరూపిస్తున్నారు. ఉదయం కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు లోకేశ్​ను కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు. ఆయా సమస్యలను విన్న నారా లోకేశ్ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.

100 రోజుల్లో రాష్ట్రంలో గంజాయి విక్రయాలకు చెక్‌ పెడతాం: మంత్రి లోకేశ్​ - Minister Lokesh in Bakrid Prayer

అందరికీ అందుబాటులో, ప్రజాక్షేత్రంలో మంత్రి లోకేశ్- కొనసాగుతున్న ప్రజాదర్బార్ - Minister Nara Lokesh Praja Darbar

ఉండవల్లిలోని నివాసంలో లోకేశ్ ప్రజాదర్బార్ - సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details