Huge Number Of Beneficiaries Are Bookings For Free Gas Cylinder : దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల (దీపం-2) పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 1న ప్రారంభించగా నాటి నుంచి 5వ తేదీ (మంగళవారం) వరకు రాష్ట్రవ్యాప్తంగా 20,17,110 మంది లబ్ధిదారులు సిలిండర్లు బుక్ చేసుకున్నారు. అందులో 11,84,900 మందికి సిలిండర్లు డెలివరీ చేశారు. అనంతరం వీరి ఖాతాల్లో రూ.18 కోట్ల మేర సబ్సిడీని ప్రభుత్వం జమ చేసింది. అయితే సిలిండర్ బుక్ చేసుకున్నవారికి 48 గంటల్లోపు డెలివరీ చేయాల్సి ఉండగా రోజూ లక్షల సంఖ్యలో బుకింగ్లు వస్తుండటంతో గ్యాస్ కంపెనీలపై ఒత్తిడి పెరిగింది. దీంతో సిలిండర్ల డెలివరీ ఆలస్యమవుతుం లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫ్రీ గ్యాస్ సిలిండర్ కావాలా - ఈ కార్డులు తప్పనిసరి
AP Free Gas Cylinder Scheme : రాష్ట్రంలో దీపం 2.0 కింద ఉచిత సిలిండర్ పథకానికి బుకింగ్స్ మొదలయ్యాయి. అక్టోబర్ 31వ తేదీ నుంచి సిలిండర్లూ అందిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులతో పోలిస్తే అర్హుల సంఖ్య తక్కువగా ఉంది. ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఆధారంగా రాయితీ వర్తింపజేస్తున్నామని వాటి వివరాలు లేకపోవడంతోనే అర్హుల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు.