ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ ఒక్క పొడి వేస్తే బీరకాయ కూర కమ్మగా ఉంటుంది - అన్నం, చపాతీల్లోకి అద్దిరిపోద్ది! - RIDGE GOURD MASALA CURRY

బీరకాయ కూర చాలామంది ఫేవరెట్ - ఇలా వండుకున్నారంటే ముద్ద కూడా మిగలదు

ridge_gourd_curry_rcipe
ridge_gourd_curry_rcipe (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2025, 3:55 PM IST

RIDGE GOURD CURRY RCIPE: బీరకాయ కూర అంటే చాలా మందికి నచ్చదు కానీ, బీరకాయ ఎన్నో పోషక విలువలు కలిగి ఉంది. బీరకాయ పప్పు ఎంతో రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా మీకు కాస్త సమయం ఉంటే బీరకాయలతో కర్రీ ఇలా చేసి చూడండి ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోరు. ప్రత్యకమైన మసాలా పొడి తయారు చేసుకుని వేసుకుంటే కర్రీని మళ్లీ, మళ్లీ ఇలాగే ట్రై చేస్తారు. బీరకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందామా!

పూరీలు నూనె పీల్చకుండా పొంగాలంటే పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు! - సింపుల్ ట్రిక్

బీరకాయ మసాలా కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు

  • బీరకాయ - 300 గ్రాములు
  • ఉల్లిగడ్డ - 1 మీడియం సైజు
  • టమోటాలు -2 చిన్నవి
  • నూనె - 3 టేబుల్ స్పూన్లు
  • పోపు గింజలు - కొద్దిగా
  • (ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర)
  • పచ్చి మిర్చి - 3
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - పావు టీస్పూన్
  • కరివేపాకు - ఒక రెమ్మ

రాయలసీమ స్పెషల్ "ఎల్లిపాయ కారం" - ఇంట్లో కూరగాయలు లేనపుడు నోటికి కమ్మగా ఉంటుంది!

ridge_gourd_curry_rcipe (GettyImages)

తయారీ విధానం

  • ముందుగా లేత బీరకాయను తెచ్చుకుని చేదు చూసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. లేత బీరకాయలో నీళ్ల శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కూర రుచిగా ఉంటుంది.
  • ఇపుడు కడాయిలో నూనె పోసుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె ఎక్కువగా ఉంటే బీరకాయ కూర రుచి బాగుంటుంది. నూనె వేడెక్కగానే ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర కలిపిన పోపు గింజలు వేసుకుని చిటపటలాడించాలి.
  • ఆ తర్వాత మూడు పచ్చి మిర్చి చీలికలతో పాటు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని కలుపుకోవాలి.
  • వేగిన తర్వాత కరివేపాకును తుంచి వేసుకోవాలి. కరివేపాకును ముందుగానే నూనెలో వేయడం కంటే కూర మధ్యలో తుంచి వేసుకుంటే అదనపు రుచి వస్తుంది.
  • ఉల్లి పాయ ముక్కలు మెత్తబడిన తర్వాత చిన్నగా తరిగిన బీరకాయ ముక్కలు, టమోటా ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • మంట లో ఫ్లేమ్​లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ లోగా మసాలా పొడి సిద్ధం చేసుకోవాలి.

మసాలా పొడి కోసం కావాలసిన పదార్థాలు

  • ధనియాలు - 2 టీస్పూన్లు
  • జీలకర్ర - పావు టీస్పూన్
  • లవంగాల - 3-4
  • దాల్చిన చెక్క - చిన్నది
  • కొబ్బరి - 2 ఇంచులు
  • ఎల్లిపాయ రెబ్బలు - 7 లేదా 8(సైజును బట్టి)
  • పాన్​లో మసాలా దినుసులన్నీ వేపుకోవాలి. ధనియాలు మాడకుండా దోరగా వేయించాలి. ధనియాలు మాడకుండా చూసుకోవాలి. వేగిన తర్వాత పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత పౌడర్​లాగా చేసి పెట్టుకోవాలి.
  • మసాలా పొడి తయారయ్యే లోగా బీరకాయ ముక్కలు బాగా మగ్గిపోయి ఉంటాయి. ముక్కల్లో రసం దిగుతుంది.
  • కారం వేసుకుని ఉప్పు రుచి చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి.
  • మంట లో ఫ్లేమ్​లో ఉంచి నూనె సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మసాలా పొడిని వేసుకుని రెండు నిమిషాలు ఉడికించి చివరగా కొత్తి మీర తరుగు వేసుకుంటే చాలు.
  • ఈ కర్రీ అన్నంలో, చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది.

గుంటూర్​ స్పెషల్​ "వంకాయ ఉల్లికారం" - అన్నం ఉడికేలోపు రెడీ! - చాలా సింపుల్

దోసెలు అప్పటికప్పుడు ఇలా చేసుకోండి - రుచికరమైన "బబుల్ దోసెలు"

ABOUT THE AUTHOR

...view details