Heavy Rains in joint Godavari District : ఉభయగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లపైకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దిగువ ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
నీటమునిగిన పలు గ్రామాలు :కొల్లేరు ఉద్ధృతితో ఏలూరు జిల్లాను వరద ముంచేస్తుంది. కైకలూరు, మండవల్లి, పెదపాడు మండలాల పరిధిలోని లంకగ్రామాలతోపాటు, బుడమేరు పరీవాహక ప్రాంతాలపై అధిక ప్రభావం చూపుతోంది. పెదపాడు మండలం గోగుంట, కొనికి, వసంతవాడ, సత్యవోలు, వడ్డిగూడెం తదితర గ్రామాలు నీటమునిగాయి. పెదపాడు మండలంలోని ముంపు గ్రామాలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. మండవల్లి మండలం పెనుమాకలంక, నందిగామలంక, ఇంగిలిపాకలంక, ఉనికిలి గ్రామాలు గత మూడు రోజులుగా నీటిలోనే నానుతున్నాయి.
కకావికలం అవుతోన్న శ్రీకాకుళం- వాయుగుండం ప్రభావంతో దంచికొడుతున్న వానలు - Heavy Rains in Srikakulam District
రహదారులపైకి మోకాళ్ల లోతు నీరు : కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మండవల్లి మండలంలో ముంపునకు గురైన గ్రామాలకు పడవలో వెళ్లి పరిశీలించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దు వద్ద ఉప్పుటేరులో గుర్రపు డెక్క, కిక్కిస తొలగింపు పనులను ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, రఘురామకృష్ణం రాజు పరిశీలించారు.కైకలూరులో జగనన్న కాలనీ ముంపు బారిన పడింది. కాలనీలోని రహదారులపైకి మోకాళ్ల లోతు నీరు చేరింది. కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తంచేశారు.కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయం నుంచి దిగువకు 5,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - red alert for north andhra
రాకపోకలకు అంతరాయం : ఎగువ నుంచి 11,831 క్యూసెక్కుల నీరు ఆదివారం ఏలేరుకి చేరింది. రిజర్వాయర్ నీటి మట్టం 86.56 మీటర్లు కాగా ప్రస్తుతం 85.05 మీటర్లు ఎత్తున నీరు చేరింది. దీంతో ఎడమ కాలువ ద్వారా విశాఖకి 275 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నారు. అప్పన్నపాలెం కాజ్‌వే బ్రిడ్జి మరోసారి కుంగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ బ్రిడ్జిని అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించారు. దిగువ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అల్పపీడనం ప్రభావం - మన్యం జిల్లాలో భారీ వర్షాలు - Heavy Rains in Manyam District