AP SSC 2024 supplementary exams: అనంతపురం జిల్లా ఉరవకొండలో మూతపడిన పాఠశాల పేరుతో హాల్‌టికెట్లు జారీ చేయడం గందరగోళానికి దారి తీసింది. హాల్‌టికెట్లలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాన్ని తప్పుగా నమోదు చేశారు. దీంతో విద్యార్థులకు ఉరవకొండ ఇందిరా కాలనీలో ఎంత వెతికినా ఆ కేంద్రం కనిపించలేదు. ఇక్కడి పాఠశాలను యాజమాన్యం మరోచోటికి మార్చడంతో పాటు పేరును కూడా మార్చేసింది.
ఉరవకొండలో ఏళ్లక్రితం మూతపడిన ఉషోదయ స్కూల్ పేరుతో, పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు... విద్యాశాఖ అధికారులు హాల్‌టికెట్లు జారీ చేశారు. హాల్‌టికెట్‌లో ఇచ్చిన చిరునామాలో ఉషోదయ స్కూల్ లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎప్పుడో మూసేసిన స్కూల్ పేరు మీద హాల్‌టికెట్లు ఇవ్వడం ఏంటని తల్లిదండ్రులు మండిపడ్డారు. పాఠశాల వద్దకి చేరుకునేలోపు ఆలస్యమైనందున పరీక్షకు అనుమతిలేదనడంతో తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. చేసేదేమీలేక అధికారులు పరీక్షకు అనుమతించారు.
SSC Exam Pattern change పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల్లో మార్పులు..! ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు..