Government Should Focus on Srikalahasti Temple Development :పంచభూత లింగాల్లో రాష్ట్రంలో ఉన్న ఏకైక వాయులింగ క్షేత్రంగా ఖండాంతర ఖ్యాతి గడిస్తున్న శ్రీకాళహస్తీశ్వరాలయం దినదిన ప్రవర్ధమానం చెందుతోంది. ఇక్కడ ఉన్న ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా టీడీపీ ప్రభుత్వ హయాంలో బృహత్తర ప్రణాళిక ఏర్పాటుకు ఆరు సంవత్సరాల కిందట బీజం పడింది. వైఎస్సార్సీపీ హయాంలో ప్రణాళికలు తరచూ మార్పడంతో ఐదు సంవత్సరాల పుణ్యకాలం పూర్తయింది తప్ప ఆ దిశగా అడుగులు పడిన దాఖలాలు లేకుండా పోయాయి. టెంపుల్ టూరిజం (Temple Tourism) ప్రకటన నేపథ్యంలో పెరుగుతున్న రద్దీ, ఆదాయం తగ్గట్టుగా భక్తులకు అవసరమైన వసతులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది.
బృహత్తర ప్రణాళిక అమలు అయితే అన్ని సమస్యలకు చెక్ : శ్రీకాళహస్తీశ్వరాలయానికి వస్తున్న భక్తుల వసతుల దృష్ట్యా బృహత్తర ప్రణాళిక అమలు ఒక్కటే పరిష్కారం. శ్రీవారి తిరుమలకు వచ్చే భక్తుల్లో 60 % శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం వస్తుంటారు. వారాంతంలో రోజుకు 25 వేల మందికి పైగా భక్తులు వస్తున్నారు. వచ్చిన వారికి సంతృప్తికర దర్శనం అన్నది మాటలకు పరిమితం అవుతోంది. రాహు, కేతు పూజలకు దాదాపు 2 గంటలు, దర్శనం కోసం మరో 2 గంటలు ఇలా భక్తులు దర్శనం పూర్తి చేసుకునేందుకు సుమారు 4 నుంచి 6 గంటలు శ్రమ పడాల్సి వస్తోంది.
తిరుమలలో ఆ 5 డ్యామ్‌లపై ప్రభుత్వం ఫోకస్ - నీటి నిల్వ 0.5 టీఎంసీలకు పెంపు!
ఈ పరిస్థితిలో భక్తులు ప్రశాంతంగా కూర్చొని విశ్రాంతి తీసుకునేందుకు క్యూ సముదాయాలు లేవు. ఒక్కసారి ఆలయంలోకి వచ్చాక మళ్లీ వెనక్కి వెళ్లేందుకు వీల్లేని పరిస్థితి నెలకొంది. వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బృహత్తర ప్రణాళిక అమలు అయితే ఇక్కడకు వచ్చే భక్తులకు 90 % సమస్యలు తీరినట్లే.