ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీతూబాయికి రూ.4 కోట్ల ఆస్తులు - నానక్​రూమ్​గూడ గంజాయి కేసులో విస్తుపోయే విషయాలు - Ganja Peddler Neetu Bai

Ganja Peddler Neetu Bai Case Updates : హైదరాబాద్ నానాక్‌రామ్‌గూడలో గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన నీతూబాయి కేసులో పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెకు రూ.4 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో 17 మందిని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు.

neetu_bai_case
neetu_bai_case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 12:01 PM IST

Ganja Peddler Neetu Bai Case Updates : హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో గంజాయి విక్రయాలు సాగిస్తున్న కేసులో అరెస్టైన నీతూబాయిపై (Ganja Seller Neetu Bai) పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా సాదాసీదా కిరాణ దుకాణం నిర్వహించే ఆమె బ్యాంకు ఖాతాల్లో రూ.1.63 కోట్ల నగదు, హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో రూ.2 కోట్ల విలువైన స్థిరాస్థులు ఉన్నాయని టీఎస్ న్యాబ్ పోలీసులు గుర్తించారు. గంజాయి అమ్ముతూ నీతూబాయి కుటుంబం ఎనిమిదేళ్లలో ఇలా సంపాదించినట్లు నిర్ధారించారు.

కంటైనర్​లో తరలిస్తున్న 450 కిలోల గంజాయి పట్టివేత - నిందితులు అరెస్ట్

Nanakramguda Ganja Case Updates :గతంలో నీతూబాయిపై పీడీ చట్టం ప్రయోగించి ఏడాది పాటు జైళ్లో ఉంచినా విడుదలైన అనంతరం మళ్లీ దందా కొనసాగిస్తుండటం పోలీసులను విస్తుపోయేలా చేసింది. బుధవారం రోజున పోలీసుల డెకాయ్‌ ఆపరేషన్‌లో నీతూబాయి, ఆమె భర్త మున్నుసింగ్‌(53), సమీప బంధువులు సురేఖ(38), మమత (50)తోపాటు 13 మంది గంజాయి (Ganja Smuggling in Telangana) వినియోగదారులు వెరసి మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. ధూల్‌పేటకు చెందిన అంగూరిబాయి, నానక్‌రాంగూడకు చెందిన నేహాబాయి, గౌతమ్‌సింగ్‌ పరారీలో ఉన్నారు. అరెస్టైన వారి నుంచి 22.6 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, రూ.22.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు టీఎస్‌ న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య పేర్కొన్నారు.

ఏలూరు టూ దిల్లీ ఎర్రచందనం జర్నీ- దొరికిన దుంగల దొంగలు

చీకటి దందాతో విలాస జీవనం : తేలిగ్గా డబ్బు సంపాందించేందుకునీతూబాయి, మున్నుసింగ్‌, ఇతర కుటుంబసభ్యులు గంజాయి విక్రయాలు మొదలుపెట్టారు. ధూల్‌పేటకు చెందిన అంగూరిబాయి నుంచి కిలో గంజాయి రూ.8,000 చొప్పున కొనేవారు. దానిని 5 గ్రాముల చొప్పున చిన్న పొట్లాల్లో నింపి రూ.500కు అమ్మేవారు. అలా కిలో గంజాయి విక్రయాలతో రూ.50,000ల వంతు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుతో అంతా విలాసవంత జీవితాన్ని గడుపుతున్నారు. ఖరీదైన ప్రాంతాల్లో ఇళ్లు, స్థిర, చరాస్థులు కొనుగోలు చేశారు. గత సంవత్సరం ఆగస్ట్‌లో నీతూబాయి కుటుంబ నేపథ్యాన్ని పోలీసులు ఆరా తీశారు. ఈ క్రమంలోనే రూ.4 కోట్ల ఆస్తులున్నట్లు గుర్తించారు. వాటిని ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఆమె గంజాయి విక్రయాలు చేస్తూనే ఉంది.

రెండు జిల్లాల పోలీసులను పరుగులు పెట్టించిన గంజాయి లారీ - సినిమా స్టైల్​లో ఛేజ్​

ఇప్పటికే 18 కేసులు : మరోవైపు నీతూబాయిపై తొలుత 2017లో శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ విభాగం కేసు నమోదు చేసింది. అది మొదలు 2021 సెప్టెంబర్ వరకు ఆమెపై 12 కేసులు నమోదు కావడంతో పీడీ చట్టం ప్రయోగించారు. ఏడాది అనంతరం జైలు నుంచి తిరిగి వచ్చిన రెండు నెలలకే మరోసారి గంజాయి విక్రయిస్తూ చిక్కింది. అలా గతేడాది అక్టోబర్‌ 25 వరకు మరో ఆరు కేసులు నమోదయ్యాయి. తాజా పరిణామాల నేపథ్యంలో నీతూబాయిపై మరోసారి పీడీ చట్టం ప్రయోగించేందుకు హైదరాబాద్‌ పోలీసులు నివేదిక రూపొందించారు.

ABOUT THE AUTHOR

...view details