ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శంకర్ పొలిటికల్ గేమ్ ఛేంజర్ - 'ఎన్నో సీన్లకు కనెక్ట్ అవుతారు' - RAMCHARAN GAME CHANGER

సంక్రాంతి కానుకగా వస్తోన్న గేమ్​ఛేంజర్ సినిమా - అంచనాలు పెంచేసిన ట్రైలర్

ramcharan_game_changer_movie
ramcharan_game_changer_movie (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 7, 2025, 12:50 PM IST

Updated : Jan 7, 2025, 1:42 PM IST

Ramcharan Game Changer: గేమ్ ఛేంజర్ తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో వినిపిస్తున్న పేరు. జెంటిల్​మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు, శివాజీ, రోబో వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు అందించిన శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రమిది. మెగా వారసుడు రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే అంచనాలను పెంచేసింది. శంకర్ గత చిత్రాల్లో ప్రధానమైన ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ సినిమాలు సామాజిక నేపథ్యం, అవినీతి కథాంశాలుగా తెరకెక్కాయి. తాజాగా వస్తోన్న గేమ్ ఛేంజర్ సైతం అదే తరహాలో రూపుదిద్దుకున్నట్లుగా అభిమానులు అంచనా వేస్తున్నారు.

శంకర్ తన గత చిత్రాల్లో కథానాయకుడి పాత్రలు ఎంతో భిన్నంగా తీర్చిదిద్దారు. ఒక్కరోజు సీఎం అవకాశమిస్తే రాష్ట్ర భవిష్యత్ మార్చేసిన హీరోను ఒకే ఒక్కడులో చూశాం. తెగిపోయిన బ్రేక్ వైరు పట్టుకుని అపరిచితుడిని మేల్కొల్పి అవినీతి నేతలపై జరిపిన పోరాటాల్నీ తెరపై ఆస్వాదించాం. జెంటిల్​మెన్, భారతీయుడు, శివాజీ చిత్రాల్లోనూ అవినీతి నేతలు, అక్రమాలే కథా వస్తువులు.

హీరోయిన్‌ వేధింపుల కేసులో విచారణకు ఆదేశం- ముంబయికి పోలీసు బృందాలు - చిక్కుల్లో IPSలు

'ఎన్నో సీన్లకు గేమ్ ఛేంజర్​తో కనెక్ట్ అవుతారు'

గేమ్ ఛేంజర్ సినిమా నేపథ్యం అవినీతి రాజకీయ నేతకు, నిఖార్సయిన ప్రభుత్వ అధికారికి మధ్య జరిగే ఘర్షణగా తెలుస్తోంది. "కడుపు నిండా వంద ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలేస్తే పెద్దగా దానికొచ్చే నష్టమేమీ లేదు.. కానీ అది లక్ష చీమలకు ఆహారం అనే డైలాగ్ తోపాటు "నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు ఐఏఎస్" అనే మరో డైలాగ్ అవినీతి రాజకీయ నేతపై జరిపే పోరాటాన్ని గుర్తు తెస్తోందంటున్నారు రామ్ చరణ్ అభిమానులు. "మన రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నో సీన్లకు గేమ్ ఛేంజర్​తో కనెక్ట్ అవుతారు" అని సినిమా నిర్మాత దిల్ రాజు సైతం ప్రీ రిలీజ్ ఈవెంట్​లో వ్యాఖ్యానించి ఆసక్తి పెంచారు.

ఆ ఇద్దరే కీలకం

రాజకీయ నేతలు, అధికారులు రైల్వే ట్రాక్ లాంటి వారు. పరిపాలన రెండు పట్టాలపై పరుగులు తీస్తుంది. పక్కపక్కనే కలిసే ఉన్నా ఎవరి పరిధి వారిదే. నిఖార్సయిన నాయకులకు తేడు నిజాయితీ కలిగిన అధికారులు ఉంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. కానీ, ఇరు వర్గాలు కలిసి అవినీతికి పాల్పడితే, అక్రమాలకు తెగబడితే సమాజం పతనం తప్పదు.

కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలకు సాగిలపడిపోయి కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అధికార పార్టీ కార్యకర్తల్లా పని చేశారు. చట్టాలను అతిక్రమించి ప్రజా సంపదను దోచుకోవడంలో వైఎస్సార్సీపీ నేతలకు అండగా నిలిచారు. వైఎస్సార్సీపీ నేత ప్రాపకంలో ముంబైకి చెందిన హీరోయిన్​ను వేధించిన కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర వెలుగులోకి రాగా, పలువురు ఐఏఎస్ అధికారులు అధికార పార్టీ అక్రమాలకు వంత పాడుతూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారులు స్వేచ్ఛగా, సమర్ధంగా పని చేస్తేనే వ్యవస్థలు బలంగా ఉంటాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల మొదలు ఇసుక దోపిడీ వరకు ఎన్నో అక్రమాలు జరిగినా ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్లు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. ఉన్నత చదువులు చదువుకున్న అధికారులు అక్రమాలపై ప్రేక్షక పాత్ర వహించడం ఆశ్చర్యం కల్గించిందని, పాలనా వ్యవస్థ విఫలమైతే ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఐఏఎస్ అధికారుల వివాదాస్పద నిర్ణయాలు, ఐపీఎస్​ల అరాచకాలు గడిచిన ఐదేళ్లలో ఎన్నో చూశాం. కానీ, రాష్ట్రాభివృద్ధిలో రాజకీయ నేతల ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే నిఖార్సయిన అధికారి ఒక్కరున్నా చాలు అనే సందేశాన్ని గేమ్ ఛేంజర్ లో చూస్తామా? ఇటీవల ఓ సీఐ ఎంపీడీవోపై దాడికి పాల్పడిన రాజకీయ నేతను ఈడ్చుకుంటూ స్టేషన్ తీసుకువెళ్లి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, నెటిజన్లు పోలీస్ శాఖకు జేజేలు పలికించడం తెలిసిందే. రాజకీయ నేత పాత్రలో ఎస్​జే సూర్య, కలెక్టర్ గా రామ్​చరణ్ పాత్రలు ఎంత పవర్ ఫుల్ గా ఉండనున్నాయో తెరపై చూడాల్సిందే.

పోస్టింగులు, రాజకీయ ప్రాపకం కోసం - ముంబై నటిపై ఫోర్జరీ పత్రంతో కేసు - Mumbai Actress Case

గూండాల తరహాలో కిడ్నాప్‌ చేశారు - ఏపీ పోలీసులు వేధించారు: ముంబై నటి - Mumbai Actress Harassment Issue

Last Updated : Jan 7, 2025, 1:42 PM IST

ABOUT THE AUTHOR

...view details