Free Cancer Screening Camp By Nara Lokesh In Mangalagiri : నాణ్యమైన క్యాన్సర్ నిర్ధారణ సేవలు ఉచితంగా అందించడం గర్వంగా ఉందని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. తాత ఎన్టీఆర్ (NTR) స్ఫూర్తి, తండ్రి బాలకృష్ణ (Balakrishna) ప్రోత్సాహంతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స సేవలు కొనసాగిస్తున్నామన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ నేతృత్వంలో బసవతారకం ఇండో- అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని నారా బ్రాహ్మణి (Nara Brahmani), ఆమె తల్లి వసుంధర (Nandamuri Vasundhara) తో కలిసి ప్రారంభించారు.
హిందూపురంలో నందమూరి బాలకృష్ణ సూచన మేరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం
'సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే స్పూర్తితో ఎన్టీఆర్ (NTR) స్థాపించిన కాన్సర్ ఆసుపత్రికి నందమూరి బాలకృష్ణ ఛైర్మన్గా కొనసాగుతూ పేద ప్రజలకు ఎన్నో సేవలందిస్తున్నారు. ఎందరో జీవితాల్ని చిదిమేస్తున్న కాన్సర్ పట్ల ప్రతీ ఒక్కరికీ అవగాహన అవసరం. మా కుటుంబంలో మా నాయనమ్మ కాన్సర్ బారిన పడినందు వల్ల ఇంకెవ్వరికీ ఆ బాధ ఉండకూడదనే ఉద్దేశంతో ఎంతో మంది ప్రజలకు ఉచితంగా అధునాతనమైన సేవలు అందిస్తున్నాము. మంగళగిరి ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.' - నారా బ్రాహ్మణి, లోకేష్ సతీమణి