ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక లోడ్ చేస్తుండగా ప్రమాదం - వాగులో నలుగురు యువకులు గల్లంతు

అడ్డతీగల మండలం తిమ్మాపురంలో నలుగురు యువకులు గల్లంతు

FOUR_YOUTHS_MISSING_IN_KONDAVAGU
FOUR_YOUTHS_MISSING_IN_KONDAVAGU (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 5:51 PM IST

Four Youths Missing on Kondavagu in Alluri District : అల్లూరి జిల్లా అడ్డతీగల మండలంలో విషాదం చోటు చేసుకుంది. తిమ్మాపురం గ్రామ సమీపంలోని కొండవాగు వద్ద ట్రాక్టర్​కు ఇసుక లోడ్​ చేస్తుండగా లోతు తెలియక నలుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్​ పరిశీలించారు. గల్లంతైన నలుగురు యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details