Former YCP MP Nandigam Suresh Illegal Construction Demolished : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలోని అక్రమ కట్టడాలను సీఆర్డీఏ(CRDA) అధికారులు కూల్చేశారు. వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్ తాను ఎంపీగా ఉన్న సమయంలో CRDAకు చెందిన ఎకరం స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించారు. అయిన అప్పటి సీఆర్డీఏ అధికారులు వీటిపై కన్నెత్తి చూసే సాహసం చేయలేదు. వీటిలోనే అర్ధరాత్రి వరకు విందులు చేసుకుంటూ సెటిల్‌మెంట్ చేసేవారు. విజయవాడ నుంచి యువతను తీసుకొచ్చి గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్రమాన్ని నిర్మాణాలపై సీఆర్డీఏ అధికారులు దృష్టి సారించారు. ఉద్దండరాయినపాలెంలో సురేష్ అక్రమంగా నిర్మించిన నివాసాలను సీఆర్డీఏ అధికారులు కూల్చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాజధానిలో పంటల సాగు చేపట్టి భారీగా లబ్ధి : ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాజధాని అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు, నాయకులు చేసిన అక్రమాలకు అంతే లేదు. రాజధానికి చెందిన భూముల్లో అనధికారికంగా పంటల సాగు చేపట్టి భారీగా లబ్ధి పొందారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొంతమంది వైఎస్సార్సీపీ నాయకుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు.
'పెత్తనం చెలాయించిన చోటే నిందితుడిగా' - చక్రం తిప్పిన స్టేషన్ సెల్లో బందీగా మారిన మాజీ ఎంపీ