Former CM Jagan occupy public propert: గతంలో సీఎం క్యాంపు కార్యాలయం, ప్రస్తుత వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయానికి వినియోగిస్తున్న రహదారిపైకి, ప్రజలను అనుమతించకపోవటం దుమారం రేపుతోంది. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రహదారిని... ప్రైవేటు రోడ్డుగా మార్చుకోవడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.! అప్పట్లో క్యాంపాఫీస్ కోసం ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నిచర్‌ను వైఎస్సార్సీపీ సొంత అవసరాలకు వాడుకోవడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైకొత్త ప్రభుత్వం త్వరలోనే విచారణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లే, డబుల్ లేన్ రహదారిపైకి సాధారణ పౌరుల్ని అనుమతించడంలేదు..! రహదారులు భవనాల శాఖ నిర్మించిన ఆ రహదారిపైకి స్థానికంగా రాకపోకల్ని నిషేధించటం వివాదం రేపుతోంది. గడచిన ఐదేళ్లుగా, ఈ రహదారిని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం మాత్రమే వినియోగించారు. ఇతరులెవరికీ ప్రవేశం లేకుండా నిషేధించారు. జగన్ ముఖ్యమంత్రి పదవి పోగానే, క్యాంపు కార్యాలయాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంగా మార్చేశారు. ఐనా, ఆ మార్గంలోకి ఎవరినీ అనుమతించకవడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.! వాస్తవానికి ప్రకాశం బ్యారేజీ నుంచి రేవేంద్రపాడు వరకూ..డబుల్ లేన్ రోడ్డు కోసం అప్పట్లో 5కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. కానీ, ఆ నిధులతో జగన్ క్యాంపు కార్యాలయ పరిధిలో ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డు మాత్రమే వేశారు. అప్పట్లో భద్రతాసిబ్బంది ఆ రోడ్డుపైకి ఎవర్నీ అనుమతించలేదు. ఇప్పుడుజగన్ సీఎం హోదాలో లేకపోయినా.. ప్రజాధనంతో నిర్మించిన రోడ్డుపైకి ప్రజలనెవరినీ జగన్ భద్రతా సిబ్బంది అనుమతించటం లేదు. స్థానిక ప్రజల నుంచి దీనిపై ఫిర్యాదులు అందడంతో.. రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
లోటస్ పాండ్ వద్ద అక్రమ నిర్మాణాలు తొలగించిన జీహెచ్‌ఎంసీ అధికారులు