ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరిహద్దులో గూఢచారి రాబందు - జీపీఎస్ ట్రాకర్, మైక్రో కెమెరాతో నిఘా! - HAWK WITH GPS TRACKER - HAWK WITH GPS TRACKER

HAWK WITH GPS TRACKER : తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో వాలిన రాబందును ఎవరు పంపించి ఉంటారు? రెండు కాళ్లకు జీపీఎస్​ ట్రాకర్, మైక్రో కెమెరాతో వాలిన ఆ రాబందు సైనిక బలగాలకు చెందినదనే అనుమానాలు పలువురు వ్యక్తం చేశారు. వాతావరణంలో మార్పులపై పరిశోధనా? అడవులపై శోధనా? లేక ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల ఉనికిని గుర్తించడమా? అనే చర్చ జరుగుతోంది.

hawk_with_gps_tracker
hawk_with_gps_tracker (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2024, 2:10 PM IST

HAWK WITH GPS TRACKER :ఓ కాలికి జీపీఎస్ ట్రాకర్, మరో కాలికి మైక్రో కెమెరా.. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ రాబందు అలసిపోయి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాలింది. ఎక్కువ సేపు అక్కడే ఉండడంతో కొంత మంది గమనించి దాని ఆకలిదప్పులు తీర్చే ప్రయత్నం చేశారు. కోడి మాంసంతో పాటు నీళ్లు అందించగా అది సేదదీరింది. చివరికి అటవీ అధికారులు స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తరలించగా.. ఆ రాబందు పూర్వాపరాలపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో జీపీఎస్ ట్రాకర్​తో తిరుగుతున్న రాబందును అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 3 రోజుల క్రితం చర్లలో సంచరించిన రాబందు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎక్కడి నుంచో చర్ల మండలంలోని ఏకలవ్య విద్యాలయం గుట్ట ప్రాంతానికి వచ్చిన రాబందు చాలాసేపు అక్కడే కూర్చుండిపోయింది. తిరిగి తిరిగి వచ్చిన రాబందు అలసిపోవడంతో స్థానికులు గమనించి కోడి మాంసాన్ని తీసుకువచ్చి వేశారు. దీంతో కోడి మాంసాన్ని తిని ఆకలి తీర్చుకుంది. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం వేరే ప్రాంతానికి ఎగిరి వెళ్లిపోయింది. అక్కడ ఉన్న స్థానికులు దాని ఫొటోలను వీడియోలను చిత్రీకరించారు. ఆ రాబందు కాళ్లకు జీపీఎస్ ట్రాకర్​తో పాటు కెమెరా కూడా ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ రాబందు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం అక్కడి స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ రాబందు ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులకు చిక్కడంతో స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బంది ఆ పక్షిని కార్యాలయంలో ఉంచారు.

దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర పోలీసు బలగాలు జల్లెడపడుతున్నాయి. ఇప్పటికే ల్యాండ్ మైన్ల కారణంగా భారీగా నష్టపోయిన సీఆర్​పీఎఫ్​ బలగాలు.. మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. మావోయిస్టుల ట్రాప్​లో పడకుండా వారి ఆచూకీ కోసం సరికొత్త పంథా అనుసరిస్తున్నాయి. ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. ఓ వైపు డ్రోన్ల సాయంతో అణువణువూ పరిశీలిస్తున్నాయి. నిఘా పెంచిన క్రమంలోనే రాబందులను కూడా వినియోగిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమను ఏరివేసేందుకు పోలీసులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారని, అటవీ గ్రామాల్లో భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని మావోయిస్టు నేతలు గతంలో ఆరోపణలు చేయడం విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న చర్ల పరిసరాల్లో గద్ద ప్రత్యక్ష్యం కావడం వారి ఆరోపణలు బలాన్నిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. రాబందు కాలికి జీపీఎస్ ట్రాకర్, కెమెరా ఉండడంపై ఎవరికి వారు వాదనలు వినిపిస్తున్నారు.

వాతావరణ పరిశోధనలా? మావోయిస్టుల వేటా?

దేశ సరిహద్దు భద్రత విధుల్లో సైనిక బలగాలు పక్షులు, ముఖ్యంగా గద్దలకు శిక్షణ ఇచ్చి వినియోగిస్తున్నాయి. గతంలో టెర్రరిస్టులు డ్రోన్ల ద్వారా దాడులు చేసిన నేపథ్యంలో వాటిని కూల్చేందుకు గద్దలకు శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది. కాగా, భద్రాచలం కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో వాలిన గద్ద ఎక్కడి నుంచి వచ్చిందో అంతుచిక్కడం లేదు. అటవీ పరిశోధనలకు దీనిని ఉపయోగిస్తున్నరా లేక గద్దల జీవన శైలిని తెలుసుకునేందుకు ఏదైనా సంస్థలు పంపించాయా అనేది తెలియడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. జీపీఎస్ ట్రాకర్, కెమెరా అమర్చి ఎందుకు పంపినట్టు? ఎవరు వీటిని పంపించారు? అనే విషయం సరికొత్త చర్చకు దారితీసింది.

ABOUT THE AUTHOR

...view details