ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు - ఐదుగురు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు - Accidents in Palnadu District - ACCIDENTS IN PALNADU DISTRICT

Five People Dead in Road Accidents: పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో మొత్తం ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నరసరావుపేట వద్ద కారు ఆర్టీసీ బస్సుని ఢీకొట్టింది.అంజనీపురం టోల్ ప్లాజా దగ్గర ఆగి ఉన్న లారీని ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ రెండు ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Five People Dead in Road Accidents
Five People Dead in Road Accidents (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 19, 2024, 7:05 PM IST

Five People Dead in Palnadu District Road Accidents : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నరసరావుపేట ఎన్జీవో కాలనీకి చెందిన నలుగురు వ్యక్తులు ఓ ఫంక్షన్​కు వెళ్లి కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. నరసరావుపేట వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయపడిన ఇద్దరిని స్థానికులు వెంటనే నరసరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

'రోడ్డే' ప్రాణం తీసింది - ఏడేళ్ల బాలుడు మృతి- స్థానికుల ధర్నా - Road Accident in Vizianagaram

బాపట్ల జిల్లా నరసాయపాలెంలో జరిగిన ఫంక్షన్​కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న గ్రామీణ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షించారు. కారులో ఉన్నవారు జాస్తి బాబు, భూపతి, కనుమూరి ఆంజనేయులు, సూరె పద్మావతిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Three Dead in Road Accident :పిడుగురాళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పిడుగురాళ్ల మండలం అంజనీపురం టోల్ ప్లాజా దగ్గర రోడ్డుపై ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. గురజాలలో జరిగిన ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు పిడుగురాళ్ల పట్నానికి చెందిన మారూరి నాగ తేజరెడ్డి, ఇందు, అమూల్యగా గుర్తించారు.

రెండు బైక్​లను ఢీకొట్టిన లారీ- ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు - Two people died on road accident

ABOUT THE AUTHOR

...view details