Fake Website Scams in Online Shopping : గుంటూరు జిల్లాలోని మంగళగిరికి చెందిన రమణ అనే వ్యక్తి యూట్యూబ్‌లో 'ఫార్మల్‌షాప్' వెబ్‌సైట్ పేరుతో ఓ యాడ్ చూశారు. 'రూ.10 వేలు ఆ పైన విలువ చేసే బ్రాండెండ్ దుస్తులు అతి తక్కువ ధరకు అందిస్తున్నాం. స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. త్వరపడండి' ఇది ఆ యాడ్‌లోని సారాంశం. దసరా పండుగ సందర్భంగా అన్ని షాపులు, వెబ్‌సైట్లలానే వీరూ కూడా భారీ తగ్గింపు ధరకు అమ్ముతూ ఉండవచ్చని రమణ భావించారు. ఈక్రమంలోనే ఆ లింక్‌ను క్లిక్ చేశారు. ఆ వెబ్‌సైట్‌లో రూ.8000 నుంచి రూ.10 వేల విలువైన దుస్తుల్ని కేవలం రూ.899, రూ.999, రూ.1499కి ఇస్తున్నట్లు ఉంది. అందులోనే 7 రోజుల రిటర్న్ పాలసీ కూడా ఉంది.
దీంతో 4 చొక్కాల కాంబో ప్యాక్‌ను 'క్యాష్ ఆన్ డెలివరీ' పద్ధతిలో బుక్ చేశాడు రమణ. ఈ క్రమంలో పార్శిల్ రమణ ఇంటికి వచ్చింది. తెరిచి చూస్తే ఏముంది ఓ పాత చొక్కా, చినిగిపోయిన ప్యాంట్ ఉంది. దీంతో షాక్ అయిన రమణ వెంటనే రిటర్న్ పాలసీలో పంపాలని చూస్తే ఆ ఆప్షన్ పని చేయలేదు. కస్టమర్ కేర్ నంబర్ అందులో లేదు. ఈ మెయిల్‌కు స్పందన కరవు. డెలివరీ చేసిన సంస్థను సంప్రదిస్తే లోపల ఉన్న వస్తువులతో తమకు సంబంధం లేదని పేర్కొంది. దీంతో తాను మోసపోయినట్టు అర్థమైంది రమణకు.
ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? తొందరపడితే డబ్బులు పోతాయ్ - జర జాగ్రత్త! - Online Shopping Traps
కేటుగాళ్లకూ పండగే :పండుగల సీజన్ కావడంతో అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకొనేలా ఆఫర్ల జోరు సాగుతోంది. అన్ని పేరు మోసిన షాపింగ్ షాపులు, వైబ్సైట్ల ఆఫర్లు ప్రకటించాయి. ఇదే అదనుగా భావించిన సైబర్ కేటుగాళ్లు కూడా చెలరేగిపోతున్నారు. నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి కళ్లు చెదిరే ఆఫర్లు అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తూ వాట్సప్‌కు లింక్‌లు పంపుతున్నారు. కొనుగోలుదారుడికి ఏ మాత్రం అనుమానం రాకుండా అత్యంత ఆకర్షణీయంగా నకిలీ వెబ్‌సైట్లను కేటుగాళ్ల రూపొందిస్తున్నారు. వెబ్‌సైట్ కింద చూస్తే సంస్థ చిరునామా, కాంటాక్ట్ నంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్, టోల్‌ఫ్రీ నంబర్లు కూడా అందుబాటు ఉంచారు. రిఫండ్ పాలసీ, షిప్పింగ్ పాలసీ ఇలా అన్నీ ఉంటాయని కస్టమర్స్‌ను నమ్మిస్తున్నారు. ఆర్డర్ చేశాక ట్రాకింగ్ ఐడీలను కూడా కల్పించారు. కానీ ఇవన్నీ వినియోగదారుల్ని తమ బుట్టలో పడేయడానికే.
మొత్తం నగదు కాజేస్తారు :బంఫర్ ఆఫర్ అంటూ వివిధ రకాల వెబ్‌సైట్లను నమ్మి ఆన్‌లైన్ పేమెంట్ చేస్తే అసలు పార్శిల్ వచ్చే అవకాశమే ఉండదు. బ్యాంకింగ్ వివరాల్ని ట్రాక్ చేసి అకౌంట్లో ఉన్న మొత్తం సొమ్మును కాజేసే ప్రమాదం కూడా ఉంది.
పండగ వేళ ఆన్‌లైన్ సేల్స్ జోరు- వారంలోనే రూ.54వేల కోట్ల ఆర్డర్స్ - Festive Season Online Sales