Electrical Staff Adventure Walking on Wires To Electrician Service in Alluri : వాగులు, గెడ్డలు ఉప్పొంగితే రాకపోకలు బంద్ అయిుపోతాయి. అలాంటి పరిస్థితుల్లో గిరిజనుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నిత్యావసరాలు దొరక్క అల్లాడిపోతూ ఉంటారు. ఇక విద్యుత్ సరఫరా నిలిచిపోయిందంటే పరిస్థితి మరింత దయనీయమని చెప్పాలి. అందుకేనేమో అల్లూరి జిల్లాలో విద్యుత్ పునరుద్ధరణకు ఏపీఈపీడీసీఎల్ (EPDCL) సిబ్బంది పెద్ద సాహసమే చేశారు.
అల్లూరి జిల్లాలో వర్ష బీభత్సం- విరిగిన కొండచరియలు, స్తంభించిన జన జీవనం - rain updates
సాహస ప్రయాణం :వరదల సమయంలో అత్యావసర సేవలందించే ప్రభుత్వ సిబ్బంది సాహస ప్రయాణం. ఎలాంటి అడ్డంకులు ఉన్నా వెరవకుండా ప్రజలకు సేవలందించి విధి నిర్వహణ పట్ల ఉన్న నిబద్ధతను విద్యుత్ సిబ్బంది చాటుకుంటున్నారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవిలో ఇటీవల వర్షాల కారణంగా సున్నంపాడు గ్రామానికి వెళ్లే విద్యుత్ లైన్‌పై చెట్లు పడిపోయాయి. దీంతో సున్నంపాడు, దేవరపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజమండ్రి సర్కిల్ ఎస్ఈ మూర్తి ఆదేశాలతో మారేడుమిల్లి ఏఈ శ్రీనివాస్ పర్యవేక్షణలో లైన్‌మెన్ సిబ్బంది సాహసోపేతంగా పనిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరణ చేశారు.