Election Commission Orders on Polling Agents : పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం పేర్కొంది. పోలింగ్ తేదీ రోజు ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పిస్తే సరిపోతుందని ఈసీ తెలిపింది. అయితే పోలింగ్ ఏజెంట్లను ఆయా పార్టీల అభ్యర్థులు ధ్రువీకరించాల్సి ఉంటుందిని పేర్కొంది. ప్రొసైడింగ్ ఆఫీసర్ సమక్షంలో పోలింగ్ ఏజెంట్ల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని ఈసీ స్పష్టత ఇచ్చింది.
ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ నిషేధం- ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే! - EC ban on exit polls in media
పోలింగ్ ఏజెంట్ల నియామకంలో ఈసీ కీలక నిర్ణయం :ఏపీలో (Andhrapradesh) మరో మూడు రోజుల్లో ఎన్నికలు (AP Elections 2024) జరుగనున్నాయి. ఇందుకు కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అలాగే పోలింగ్ ఏజెంట్ల నియామకం విషయంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. సహజంగా పోలింగ్ బూత్‌లలో పోలింగ్ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లను ఏజెంట్లు గుర్తించిన తర్వాతే వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తారు పోలింగ్ సిబ్బంది. ప్రతీ పోలింగ్ స్టేషన్‌లో అభ్యర్థుల తరపున ఏజెంట్లను నియమించుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీచేసింది.
ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదు : పోలింగ్ ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోలింగ్ తేదీ రోజు ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పించి నేరుగా విధులకు హాజరు కావచ్చని ఆదేశాలు జారీ చేసింది. గతంలో చేసినట్లు ఏజెంట్లకు పోలీసు, రిటర్నింగ్ అధికారి వెరిఫేకేషన్, ఆమోదం అవసరం లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. పోలింగ్ ఏజెంట్ల విషయంలో అధికార దుర్వినియోగం జరగకుండా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. పోలీసు కేసులు ఉన్నా ఏజెంట్‌లుగా పనిచేయవచ్చని పేర్కొంది. ఏజెంట్ల నియామకం విషయంలో పోలీసులు అభ్యంతరాలు తెలిపే అధికారం లేదని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి ముగింపు : కాగా, ఎన్నికల సమయంలో డీజీపీ సహా కీలక పోలీసు అధికారుల బదిలీలు ఓవైపు, గాజు గ్లాస్ కామన్ సింబల్ వ్యవహారం ఇలా అనేక వ్యవహారాల్లో ఎన్నికల కమిషన్ కీలకంగా వ్యవహరించిన విషయం విదితమే. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్టీలో ప్రచారాన్ని ఉధృతం చేయగా రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 13వ తేదీన పోలింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే.
మరో ఇద్దరు అధికారులపై వేటు - ఆదేశాలు జారీచేసిన ఈసీ - Election Commission Transfer
సీఈసీ ఆదేశాలను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులు - వైసీపీ ప్రచారంలో! - Govt Employees Violating CEC Orders