ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేవీ రావు ఎవరో తెలియదు - ఆరోపణలు తప్పని తేలాక పరువునష్టం దావా వేస్తా: విజయసాయి రెడ్డి - VIJAYASAI ATTEND ED INVESTIGATION

కాకినాడ పోర్టు, సెజ్‌కు సంబంధించిన కేసులో ఎంపీ విజయసాయి రెడ్డిని విచారించిన ఈడీ

Vijayasai_attend_ED_investigation
Vijayasai attend ED investigation (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2025, 10:33 PM IST

ED Questions MP Vijayasai Reddy in Kakinada Sea Port Case:కాకినాడ సీపోర్టు వ్యవహారంలో తనపై ఫిర్యాదు చేసిన కేవీరావు ఎవరో కూడా తనకు తెలియదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. తానెప్పుడూ అతనికి ఫోన్‌ కూడా చేయలేదన్నారు. ఇదే విషయాన్ని ఈడీ(Enforcement Directorate) అధికారులకు తెలిపినట్లు విజయసాయిరెడ్డి వివరించారు. కాకినాడ సీపోర్టు, సెజ్​కు సంబంధించిన షేర్ల బదలాయింపుపై విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు హైదరాబాద్‌లో సుదీర్ఘంగా 6 గంటల పాటు ప్రశ్నించారు. ఇదే కేసులో గతంలో విక్రాంత్‌రెడ్డిని విచారించిన ఈడీ అధికారులు ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. మొత్తం 25 ప్రశ్నలు అడిగారని అన్నారు.

కేవీ రావు చేసిన ఆరోపణలపై తనను ప్రశ్నించారని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. కేవీ రావు ఎవరో కూడా తనకు తెలియదని, కానీ ఆయన తన పేరు ఎందుకు చెప్పారో తెలీదని అన్నారు. కేవీ రావును తానెక్కడా కలవలేదని తెలిపారు. పలు విషయాలపై తనను అనేకమంది కలుస్తుంటారని కాకినాడ సీ పోర్టుపై కేవీ రావుకు తానెప్పుడూ ఫోన్‌ చేయలేదని వెల్లడించారు. కేవీ రావును తిరుమల స్వామి వద్దకు రావాలని కోరుతున్నానని ఆయన ఫిర్యాదులు నిజమైతే వెంకటేశ్వరస్వామి ఎదుట చెప్పాలని అన్నారు. స్వామి సమక్షంలోనే నిజానిజాలు మాట్లాడుకుంటామని, మే నెలలోని కాల్‌ డేటా రికార్డ్స్‌ని తెప్పించండని కోరారు.

కేవీ రావు ఎవరో నాకు తెలియదు: విజయసాయి రెడ్డి (ETV Bharat)

ఇంటి నిర్మాణానికి ఎదురుచూడాల్సిన అవసరం లేదు - ఏపీ ప్రభుత్వం కొత్త పాలసీ

బంధుత్వమే తప్ప వ్యాపార సంబంధాలు లేవు:తాను కేవీ రావుకు ఫోన్‌ చేసినట్లు తేలితే చేసిన తప్పును అంగీకరిస్తానని, ఒకవేళ కేవీ రావు చెప్పింది నిజమే అయితే ఇద్దర్నీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించాలని ఎంపీ అన్నారు. తాను ఎంపీని అని తనకు ప్రభుత్వంలో జరిగేవి ఏవీ తెలీదని వివరించారు. ఈడీ అధికారులు అడిగినప్పుడు కూడా అదే చెప్పానని, శరత్‌ చంద్రారెడ్డితో తనకు బంధుత్వమే తప్ప వ్యాపార సంబంధాలు లేవని వెల్లడించారు. కాకినాడ పోర్ట్స్‌ వ్యవహారంలో తనకు లుక్‌అవుట్‌ నోటీసులు వచ్చేంత వరకు కూడా తనకు తెలియదని, కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు తప్పని తేలితే అతడిపై పరువు నష్టం దావా వేస్తానని విజయసాయిరెడ్డి అన్నారు.

ఇదీ కేసు: వైఎస్సార్సీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌, కాకినాడ సెజ్​ల్లోని రూ.3,600 కోట్ల విలువైన షేర్లను కేవీ రావు నుంచి బలవంతంగా లాక్కున్న కేసులో విజయసాయిరెడ్డిపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డికి గతంలోనే నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశించింది. పార్లమెంట్‌ సమావేశాల కారణంగా అప్పుడు విజయసాయిరెడ్డి హాజరుకాలేదు. దీంతో మళ్లీ నోటీసులు ఇవ్వడంతో నేడు విచారణకు హాజరయ్యారు.

గేమ్‌ ఛేంజర్‌ ఈవెంట్‌ నుంచి వెళ్తూ ఇద్దరు మృతి - ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కల్యాణ్

నేను సీఎంను కాదు- ఉన్న ఉద్యోగం తీయించేలా ఉన్నావ్! ఛలోక్తి విసిరిన లోకేశ్

ABOUT THE AUTHOR

...view details