ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ పార్కుకి వెళ్తే డైనోసర్స్​ నుంచి ఆదిమానవుని వరకు అన్నీ చూడొచ్చు! - ECOLOGICAL PARK IN SUNNIPENTA

పర్యాటకులను ఆకర్షిస్తున్న ఎకొలాజికల్‌ పార్కు- ఇక్కడ వేల సంవత్సరాల నాటి పర్యావరణ మార్పులపై అవగాహన

ecological_knowledge_park_in_sunnipenta_of_kurnool_district
ecological_knowledge_park_in_sunnipenta_of_kurnool_district (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2025, 10:21 AM IST

Updated : Jan 2, 2025, 10:46 AM IST

Ecological Knowledge Park in Sunnipenta of Kurnool District : ఉరుకుల పరుగుల జీవితంలో పచ్చని చెట్టుకింద కూర్చొని ప్రకృతి అందాలను తిలకించడం గొప్ప వరం. వారాంతరాల్లో, సెలవుల్లో పిల్లలను తీసుకొని పార్కుకు వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడమే కాకుండా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి ఎకొలాజికల్​ ఉద్యానవనం మన కర్నూలు జిల్లాలో ఉందని మీకు తెలుసా!

ఆది మానవులు (ETV Bharat)
ఆదిమానవులు (ETV Bharat)

సున్నిపెంటలోని ఎకొలాజికల్‌ పార్కు పర్యాటకులను ఆకర్షిస్తోంది. దీనిని 2011- 12లో ఏర్పాటు చేశారు. వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు భూమిపై చోటుచేసుకున్న పర్యావరణ మార్పులను కళ్లకుకట్టేలా దీనిని రూపొందించారు. ఇక్కడ డైనోసార్లు, వివిధ రకాల జంతువుల బొమ్మలు ఏర్పాటు చేసి వాటి జీవిత విశేషాలను వివరించారు. ఈ పార్కులో బిగ్‌ బ్యాంగ్‌ మొదలుకొని ఆదిమానవుడి జీవనం వరకు జీవ పరిణామ క్రమాన్ని తెలుసుకోవచ్చు.

డైనోసార్లు (ETV Bharat)
డైనోసార్లు (ETV Bharat)

పార్కు సంకెళ్లు వీడాయి- ఐదేళ్ల తరువాత ఆహ్లాదంగా సేదతీరుతున్న నగరవాసులు - REOPEN NELLORE Park

వీటితోపాటు ఇక్కడ ఆది మానవుల జీవన విధానాన్ని వివరించేలా ఏర్పాటు చేసిన బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. ఈ పార్కులో ఎనీ టెర్రాయిన్‌ వెహికల్‌ (ఏ-టీవీ) కూడా ఏర్పాటు చేశారు. ఈ పార్కుకు స్థానికులు, వివిధ పాఠశాలల విద్యార్థులే కాకుండా శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తులు, పర్యాటకులు పెద్దఎత్తున వచ్చి తిలకిస్తున్నారు.

ఆదిమానవులు (ETV Bharat)

కళతప్పిన నగరవనాలకు పర్యాటక శోభ

Last Updated : Jan 2, 2025, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details