ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పార్లమెంట్‌ నియోజకవర్గాల ఎన్నికల పోలీసు అబ్జర్వర్లుగా ఐపీఎస్‌లు - lok sabha Elections 2024

EC Appointed Andhra Pradesh Cadre IPS as Election Observers: సార్వత్రిక ఎన్నికల్లో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఏపీలోని కొందరు ఐపీఎస్ అధికారులను దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఎన్నికల పోలీసు అబ్జర్వర్లుగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 7:15 PM IST

Published : Apr 9, 2024, 7:15 PM IST

EC Appointed Andhra Pradesh Cadre IPS as Election Observers
EC Appointed Andhra Pradesh Cadre IPS as Election Observers

EC Appointed Andhra Pradesh Cadre IPS as Election Observers : సార్వత్రిక ఎన్నికల్లో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఏపీలోని కొందరు ఐపీఎస్ అధికారులను దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఎన్నికల పోలీసు అబ్జర్వర్లుగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. మొత్తం 18 మంది రాష్ట్ర కేడర్ ఐపీఎస్‌లను అబ్జర్వర్లుగా ఈసీఆదేశాలు జారీ చేసింది.

పోలీస్​ నిఘాలో ఎన్నికల నిర్వహణ- పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం - Lok Sabha Elections 2024

రాష్ట్రంలోని కొందరు ఐపీఎస్ అధికారులనూ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఎన్నికల పోలీసు అబ్జర్వర్లుగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. మొదటి దశ పోలింగ్ నిర్వహిస్తున్న ప్రాంతాలకు ఇప్పటికే కొంత మంది చేరుకున్నారు. మరికొంత మందికి ఏప్రిల్ 19 నుంచి దశల వారీగా మొదలయ్యే పోలింగ్ తేదీల వరకూ పోలీసు అబ్జర్వర్లుగా విధులు నిర్వహించాలని ఈసీ ఆదేశించింది.

ఏపీలోనిఐపీఎస్ అధికారులు కుమార్ విశ్వజిత్ ఇప్పటికే కూచ్ బేహార్​లో విధులు నిర్వహిస్తున్నారు. 19 ఏప్రిల్​ న మొదటి దశ ఎన్నిక వరకూ పోలీసు అబ్జర్వర్​గా విధులు నిర్వహించనున్నారు. సీహెచ్ శ్రీకాంత్ మాల్దా లోక్ సభ నియోజకవర్గంలో మే 7 తేదీ వరకూ పోలీసు అబ్జర్వర్​గా విధులు నిర్వహించనున్నారు. ఫకీరప్ప, కొల్లి రఘురామరెడ్డి 19 ఏప్రిల్ నుంచి మే 7 తేదీ వరకూ అస్సాంలోని గౌహతిలో పోలీసు అబ్జర్వర్లుగా విధులు నిర్వహించనున్నారు. గోపీనాథ్ జెట్టిని నాగాలాండ్​కు , పనసరెడ్డిని అరుణాచల్​కు, వెంకట సుబ్బారెడ్డిని పశ్చిమబెంగాల్, రాహుల్ దేవ్ శర్మను బీహార్​కు, రాహుల్ దేవ్ సింగ్​ను జమ్మూ కాశ్మీర్​కు పోలీసు అబ్జర్వర్లుగా ఈసీ నియమించింది. త్రివిక్రమ వర్మ బెంగుళూరులో ఏప్రిల్ 26 వరకూ విధులు నిర్వహించనున్నారు. మొత్తం 18 మంది రాష్ట్ర కేడర్​కు చెందిన ఐపీఎస్ అధికారులను ఎన్నికల పోలీసు అబ్జర్వర్లుగా ఈసీ నియమించింది.

ఈసీ బదిలీ చేసిన ఐఏఎస్‌లకు, మరో ముగ్గురికీ ప్రభుత్వం పోస్టింగ్‌ - Postings to IAS Officers in AP

రాష్ట్రానికి ఎన్నికల పోలీసు అబ్జర్వర్లు :ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్రానికి ఎన్నికల పోలీసు అబ్జర్వర్లుగా వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులను ఈసీ నియమించింది. ఆంధ్రప్రదేశ్​లో నాలుగోదశలో పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఏప్రిల్ 25 తేదీ నుంచి మే 13 తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్​లో ఎన్నికల పోలీసు అబ్జర్వర్లు పర్యటించనున్నారు.

వేటు పడిన అధికారుల స్థానంలో ఇంఛార్జులుగా జేసీలు, అదనపు ఎస్పీలు - collectors and SPs panel names

ABOUT THE AUTHOR

...view details