ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు - ఆందోళనలో ప్రజలు - EARTHQUAKE IN MUNDLAMURU

ప్రకాశం జిల్లా ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు - సెకను పాటు కంపించిన భూమి, భయంతో స్థానికుల పరుగులు

Earthquake_in_Mundlamuru
Earthquake_in_Mundlamuru (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2025, 3:52 PM IST

Earthquake in Mundlamuru at Prakasam District:ప్రకాశం జిల్లా మండల కేంద్రం ముండ్లమూరులో ఈ రోజు మధ్యాహ్నం 1.43 గంటలకు స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. సెకనుపాటు పెద్ద శబ్దంతో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇటీవల కాలంలో ఇక్కడ భూమి కంపించడం ఇది 4వ సారి. దీంతో కార్యాలయాలు, ఇళ్లు, పాఠశాలల నుంచి ప్రజలు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటనలతో ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details