ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫ్రీ గ్యాస్ సిలిండర్ కావాలా - ఈ కార్డులు తప్పనిసరి - AP FREE GAS CYLINDER SCHEME

గ్యాస్‌ కనెక్షన్‌ కుటుంబంలో ఎవరి పేరుతోనైనా ఉండొచ్చు

AP Free Gas Cylinder Scheme
AP Free Gas Cylinder Scheme (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2024, 6:59 AM IST

AP Free Gas Cylinder Scheme : రాష్ట్రంలో దీపం 2.0 కింద ఉచిత సిలిండర్‌ పథకానికి బుకింగ్స్‌ మొదలయ్యాయి. అక్టోబర్ 31వ తేదీ నుంచి సిలిండర్లూ అందిస్తున్నారు. ఈ పథకానికి తాము అర్హులమా కాదా? అనే అనుమానాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి. ఏపీలోని మొత్తం రేషన్‌ కార్డులతో పోలిస్తే అర్హుల సంఖ్య తక్కువగా ఉంది. ఆధార్, రేషన్‌ కార్డు, గ్యాస్‌ కనెక్షన్‌ ఆధారంగా రాయితీ వర్తింపజేస్తున్నామని వాటి వివరాలు లేకపోవడంతోనే అర్హుల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

EKYC Mandatory Free LPG Cylinder :ఏపీలో 1.54 కోట్ల గృహ వినియోగ వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. తాత్కాలిక అంచనా ప్రకారం 1.08 కోట్ల కనెక్షన్లు ఉచిత సిలిండర్‌కు అర్హత పొందాయి. కానీ, రేషన్‌ కార్డులు 1.48 కోట్లు ఉన్నాయి. కొంత మందికి గ్యాస్‌ కనెక్షన్, రేషన్‌ కార్డులున్నా ఆధార్‌ కార్డు ఇవ్వకపోవడంతో అర్హత పొందలేకపోయారు. వీరంతా ఆధార్‌ అనుసంధానించుకుంటే దీపం 2.0 పథక అర్హుల సంఖ్య పెరుగుతుంది.

లబ్ధిదారుల సందేహాలకు అధికారుల సమాధానాలు :

  • వంటగ్యాస్‌ రాయితీ పొందాలంటే రేషన్‌ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్‌ కనెక్షన్‌ తప్పనిసరి.
  • కుటుంబ సభ్యులలో ఎవరి పేరుమీద కనెక్షన్‌ ఉందో ఆ వ్యక్తి పేరు రేషన్‌ కార్డులో ఉంటే రాయితీ వస్తుంది.
  • భార్య పేరుతో రేషన్‌ కార్డు, భర్త పేరుతో గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నా అర్హులే.
  • ఒక రేషన్‌ కార్డులోని సభ్యుల పేర్లతో రెండు/మూడు కనెక్షన్లున్నా రాయితీ ఒక్క కనెక్షన్‌కే వర్తిస్తుంది.
  • టీడీపీ పాలనలో ఇచ్చిన దీపం కనెక్షన్లకూ ‘దీపం 2.0’ పథకం వర్తిస్తుంది.
  • గ్యాస్‌ రాయితీ జమ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌లో లేదా డీలర్‌ వద్దకెళ్లి బుక్‌ చేసుకోవచ్చు.
  • సిలిండర్‌ అందాక 48 గంటల్లో ఇంధన సంస్థలే రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తాయి.
  • ఏవైనా సమస్యలు ఉంటే 1967 (టోల్‌ ఫ్రీ) నంబరుకు ఫోన్‌ చేయొచ్చు.
  • గ్రామ/వార్డు సచివాలయాల్లో, తహసీల్దారు కార్యాలయాల్లో పౌర సరఫరాల అధికారుల్ని సంప్రదించవచ్చు.

ఈ కేవైసీ తిప్పలు :సిలిండర్ రాయితీ పొందేందుకు ఈ కేవైసీ తప్పనిసరి అని ఇంధన సంస్థల డీలర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు పెద్దఎత్తున గ్యాస్‌ డీలర్ల వద్దకు వెళ్తుండటంతో రద్దీ తలెత్తుతోంది. సర్కార్ దీనిపై దృష్టి సారించాలి. గతంలో గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ సమయంలో ఈ కేవైసీ తీసుకోవాలనే ప్రతిపాదన వచ్చింది. తర్వాత దాన్ని అమలు చేయలేదు. ఇప్పటికైనా ఆ విధానం అమలయ్యేలా చూడాలి. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో అయినా ఈ కేవైసీ తీసుకోవాలి.

వంటింట్లో వెలుగుల "దీపం" - ఉచిత గ్యాస్ అమలుపై సర్వత్రా హర్షాతిరేకాలు

"నారా వారి టీ" - స్వయంగా పెట్టి అందించిన సీఎం చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details