Director Amma Rajasekhar Eat Food in Anna Canteen in Visakha : ‘తల’ సినిమా ప్రమోషన్స్ కోసం గురువారం విశాఖ నగరానికి వచ్చిన నృత్య, చిత్ర దర్శకుడు అమ్మరాజశేఖర్, హీరో రాగిణిరాజ్, నటుడు ముక్కు అవినాష్ మంచి హోటల్ చూసి భోజనం చేయాలని కారులో బయలుదేరారు. రామాటాకీస్ కూడలి సమీపంలోని అన్న క్యాంటీన్ వద్ద జనం గుమిగూడి ఉండడంతో అక్కడకు వెళ్లి భోజనం చేశారు. అందరిలాగే క్యూలో నిల్చున్నారు. ఇంత తక్కువ ధరకు ‘టీ’ కూడా రాదు భోజనం లభిస్తుందని అక్కడి వారితో సంభాషించారు.
అన్న క్యాంటీన్లో ఐదు రూపాయల భోజనం ఎంతో బాగుందని మెచ్చుకున్నారు. ఇలా అందరితో కలిసి భోజనం చేయడం తాను జీవితంలో మర్చిపోలేనని అమ్మరాజశేఖర్ అన్నారు. ఆకలి సమయంలో అన్న క్యాంటీన్లో అన్నం తినడం ఎంతో ఆనందాన్నిచ్చిందని హీరో రాగిణి రాజ్ అన్నారు. జబర్దస్త్ కమెడియన్ నటుడు ముక్కు అవినాష్ అక్కడివారితో ఎంతో సరదాగా ముచ్చటించారు. ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం కృషిని ప్రశంసించారు.