DGP Harish Kumar Gupta met CS Jawahar Reddy: రాష్ట్రంలో ఎన్నికల రోజు, అనంతరం జరిగిన హింసపై సిట్ నివేదికను ఎలక్షన్ కమిషన్కు పంపిన వేళ, సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరిష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. సచివాలయంలో ఇద్దరు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సిట్ ప్రాథమిక నివేదికపై ఈసీ నుంచి తదుపరి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం.
DGP Harish Kumar Gupta on Cases: ఎన్నికల ముందు, ఆ తర్వాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పత్రికా ప్రకటనలో తెలిపారు. ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్, మరో ఇద్దరిని బహిష్కరణ చేసేందుకు సిఫార్సు చేశామన్నారు. ఎన్నికల ముందు రోజు నమోదైన కేసుల్లో 1522 మంది నిందితులను గుర్తించినట్లు తెలిపారు. ఎన్నికల రోజు నమోదైన కేసుల్లో 2790 మందిని గుర్తించారు. ఎన్నికల అనంతరం నమోదైన కేసుల్లో 356 మందిని గుర్తించారు. నిందితుల్లో కొందరిని అరెస్ట్ చేశామని, మరికొందరికి 41ఏ నోటీసులిచ్చామని డీజీపీ ప్రకటనలో తెలిపారు.
33 చోట్ల హింసాత్మక ఘటనలు - ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక - డీజీపీకి అందజేత - SIT report to DGP