ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హరహర మహాదేవ శంభో శంకర' - శివనామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు - MAHASHIVRATRI CELEBRATIONS 2025

రాష్ట్రంలో అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాలు - లింగేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు - భక్తులతో కిటకిటలాడుతున్న పరమేశ్వరుని ఆలయాలు

Mahashivratri Celebrations 2025
Mahashivratri Celebrations 2025 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2025, 5:26 PM IST

Mahashivratri Celebrations 2025 : మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. శైవక్షేత్రాలన్ని శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. లింగేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివాలయాలన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నివాసంలో శివరాత్రి వేడుకలు ఘనంగా చేశారు. శివయ్యకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. విజయవాడ గ్రామీణ మండలం కొత్తూరు తాడేపల్లి ఓషధీశ్వరస్వామి ఆలయంలో పరమేశ్వరుడికి వివిధ రకాల అభిషేక ద్రవ్యాలతో మహన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. గుంటూరు నగరంలోని ఆరగ్రహారం గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి 108 రకాల విశేష పూజా ద్రవ్యాలతో లింగోద్భవ కాలాభిషేకం చేశారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని పూజలు చేశారు.

గోదారిపై పంట్లతో వారధి - శివసేవకు ఇదే తోవ

సత్య సాయి జిల్లా లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయంలో బ్రహ్మరథోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదమంత్రాలతో పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణ మహోత్సవం చేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కన్యతీర్థానికి భక్తులు పోటెత్తారు. బాలత్రిపుర సుందరి దేవి సమేత సుందరేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటాకిటలాడుతూన్నాయి. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో పాపాగ్ని నది తీరం పక్కనే వెలిసిన శ్రీ దుర్గా గవి మల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పరమశివుడు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయ అర్చకులు ప్రసాద్ స్వామి స్వామివారిని ప్రత్యేక పూలతో అలంకరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి క్యూ లైన్ లలో వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

శివరాత్రి రోజు చివరి అమృత స్నానం- కుంభమేళాలో ఇసుకేస్తే రాలనంత జనం!

నెల్లూరు జిల్లాలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. మహా శివరాత్రి సందర్భంగా తెల్లవారు జాము నుంచి జిల్లాలోని అన్ని ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. భారీ క్యూలైన్లలో నిలిచి దర్శనం చేసుకున్నారు. ఆలయాల్లో అభిషేకాలు చేశారు. నెల్లూరు మూలపేటలోని మూలస్థానేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, నవాబుపేట, తీర ప్రాంతంలోని మైపాడు ఆలయం, పల్లెపాడు, రామతీర్ధం ,కందుకూరులోని పురాతన ఆలయాల్లో అధికారులు చక్కటి ఏర్పాట్లు చేశారు. భారీకేడ్లు నిర్మాణం చేసి భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మూలపేటలోని ఆలయంలో దర్శనం చేసుకుని పూజలో పాల్గొన్నారు. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లి భక్తులు సముద్ర స్నానాలు చేశారు.

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లాలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలో ప్రసిద్ది చెందిన మూలాపేట మూలస్ధానేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో ముగ్గులు వేసి దీపాలు వెలిగించి పూజలు చేశారు. స్వామివారి దర్శనానికి క్యూ లైన్ లలో భక్తులు బారులు తీరారు. వాహబ్ పేట, గుప్తా పార్క్, ఉస్మాన్ సాహెబ్ పేట, నవాబుపేట, రాజరాజేశ్వరీ అమ్మవారి ఆలయంలోని శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. ఇందుకూరుపేట మండలం పల్లెపాడు గ్రామంలో శ్రీ మీనాక్షి సమేత రామేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో ప్రత్యేక పూజలు- ఒక్కసారి దర్శిస్తే చాలు జన్మ ధన్యం!

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో కొలువైన స్వయంభు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కోనేరు వద్ద పుణ్యస్నానాలు ఆచరించి పిండతర్పణలు వదిలారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు మంచినీరు ఇతర వసతులను కల్పించారు. జంగారెడ్డిగూడెం సీఐ కృష్ణ బాబు ఆధ్వర్యంలో ట్రాఫిక్ ను క్రమబద్ధకరించారు.

వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం స్వామివారి ఉపాలయం శివరాత్రి మహోత్సవం సందర్భంగా శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయంలో మరియు కాశి విశ్వేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తుల అధిక సంఖ్యలో దర్శనానికి బారులు తీరి శివయ్యను దర్శనం చేసుకున్నారు దేవస్థానం అధికారులు భక్తులకు నిశ్చ అన్నదాన ప్రసాదాన్ని కల్పించారు స్వామి దర్శనానికి ఉదయం నుండే భక్తులు బార్లు తీరారు శివయ్యకు అభిషేకాలు నిర్వహించారు.

శివరాత్రికి చిలగడ దుంపకి లింక్​ ఏంటో తెలుసా? - ఆ రోజున ఎందుకు తింటారంటే!

ABOUT THE AUTHOR

...view details