Deputy CM Pawan Kalyan met Chief Minister Chandrababu :సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కళ్యాణ్‌కు సీఎం సాదరంగా స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సచివాలయంలో తన ఛాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు సీఎంను మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కలిశారు. సీఎం ఛాంబర్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నం చూపించి మీరు ఆ గుర్తుకు హూందాతనం తెచ్చారని చంద్రబాబును ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు ధన్యావాదాలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు తరువాత తొలి భేటీలో పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. మంత్రివర్గ భేటీ ఏర్పాటు, అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అదేవిధంగా రేపు ఉదయం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోనున్నారు.
డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంగా నీటిపారుదలశాఖ అతిధి గృహాం? :రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు విజయవాడలోని నీటిపారుదలశాఖ అతిధి గృహాన్ని పవన్‌కు క్యాంపు కార్యాలయంగా కేటాయించే అవకాశం ఉంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ- శాస్త్ర సాంకేతిక మంత్రిగా రేపు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్న పవన్‌కల్యాణ్ హైదరాబాద్ నుంచి ఇవాళ ఉదయం విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా విజయవాడలోని ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌కు వెళ్లారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు పవన్‌కల్యాణ్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం అతిధి గృహాన్ని పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలించారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా పవన్ వెంట ఉన్నారు. రెండు అంతస్తుల ఈ అతిధి గృహంలో పై అంతస్తులో నివాసం, దిగువ అంతస్తులో కార్యాలయం ఏర్పాటుపై చర్చించారు.
విశాఖకు పూర్వవైభవం కల్పించే బాధ్యత మాది- శరవేగంగా అమరావతి నిర్మాణం: పల్లా - tdp state president
పక్కనే సమావేశ మందిరం కూడా అందుబాటులో ఉండడంతో పవన్‌కల్యాణ్ గెస్ట్‌హౌస్‌ను తన క్యాంపు కార్యాలయంగా వినియోగించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ గెస్టుహౌస్‌లో కొన్ని మార్పులను పవన్ సూచించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ క్యాంపు కార్యాలయాన్ని అప్పటి జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమమహేశ్వర రావు వినియోగించారు. వైసీపీ ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ కొంత భాగాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించగా మరికొంత జలవనరుల శాఖ కార్యాలయంగా ఉంది. ఇప్పుడు మొత్తం కార్యాలయాన్ని పవన్ కల్యాణ్ తన క్యాంపు కార్యాలయంగా వినియోగించనున్నారు. సూచనప్రాయంగా పవన్ కల్యాణ్ ఈ అతిధి గృహానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. లేదంటే మరో భవనాన్ని అధికారులు పరిశీలిస్తారు. ఇప్పటికే పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ భవనాన్ని పరిశీలించి బాగుందని చెప్పారు. అతిధి గృహం పరిశీలన అనంతరం పవన్‌కల్యాణ్ నేరుగా జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.
డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికిన అమరావతి రైతులు :ఇవాళఅమరావతిలో అడుగుపెట్టిన ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు అపూర్వ స్వాగతం లభిచింది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారి రాజధానిలో అడుగు పెట్టిన జనసేనానికి అమరావతి రైతులు, మహిళలు, అభిమానులు నీరాజనం పలికారు. వాహనం పైనుంచే వారందరికీ అభివాదం చేస్తూ పవన్‌కల్యాణ్ ముందుకు కదిలారు. రాజధాని అమరావతికి ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ గజమాలతో రాజధాని రైతులు ఘనస్వాగతం పలికారు. వెంకటపాలెం నుంచి మందడం వరకు పవన్‌తో పాటు వేల మంది రైతులు, మహిళలు, అభిమానలు స్వాగత ర్యాలీ చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద పవన్‌కు గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. దారిపొడువునా పవన్‌కు పూల వర్షం కురిపించారు. అందరికీ అభివాదం చేస్తూ జనసేనాని ముందుకు కదిలారు. కష్టకాలంలో తమకు ఎంతో అండగా నిలిచిన పవన్ కల్యాణ్‌కు పూలతో స్వాగతం పలకడంపై అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భయం,బానిసత్వం నుంచి బయటపడ్డామనే భావనలో ఆర్టీసీ ఉద్యోగులు - APSRTC Employees Problems
పోలవరంలో జరిగిన నష్టం, ప్రస్తుత కష్టానికి ఎవరు బాధ్యులు?- ఏపీ జీవనాడిపై సీఎం నజర్ - PRATHIDWANI
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ- అమరావతిలో జనసేనానికి ఘన స్వాగతం (ETV Bharat)