ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మత్స్యకారుల బోటులో పేలిన సిలిండర్ - ముగ్గురి పరిస్థితి విషమం - Boat accident in Visakhapatnam - BOAT ACCIDENT IN VISAKHAPATNAM

Cylinder Blast In Boat: విశాఖ తీరంలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. జాలర్ల బోటుకు వెళ్లిన బోటులో సిలిండర్​ పేలి 9 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న విశాఖ కోస్ట్​గార్డ్​ అధికారులు మత్స్యకారుల్ని కాపాడారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

fire_accident
fire_accident

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 7:28 AM IST

మత్స్యకారుల బోటులో పేలిన సిలిండర్ - ముగ్గురి పరిస్థితి విషమం

Cylinder Blast In Boat : విశాఖ తీరానికి 65 నాటికల్ మైళ్ళ దూరంలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. సముద్రంలో చేపల వేట కొనసాగిస్తున్నప్పుడు బోటులో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే విశాఖ కోస్ట్ గార్డ్ ప్రమాద స్థలానికి చేరుకుని మత్స్యకారుల్ని కాపాడింది. క్షతగాత్రుల్ని మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

మత్స్యకారుల బోటులో పేలిన సిలిండర్​ - ఐదుగురికి తీవ్రగాయాలు - Cylinder Blast In Boat

Boat Fire Accident :చేపల వేటకు వెళ్లిన బోటు నడిసంద్రంలో అగ్ని ప్రమాదానికి గురైంది. కాకినాడ జిల్లా ఏటిమొగకు చెందిన 9 మంది మత్స్యకారులు గత నెల 24న కాకినాడకు చెందిన శ్రీ దుర్గా భవాని బోటులో చేపల వేటకు బయలుదేరారు. శుక్రవారం విశాఖ తీరానికి 65 నాటికల్‌ మైళ్ల దూరంలో వేట సాగిస్తుండగా జనరేటర్‌లో మంటలు చెలరేగి బోటును చుట్టుముట్టాయి. జాలర్ల సమాచారంతో కోస్ట్‌గార్డ్‌ నౌక 'వీర' వెంటనే అక్కడికి చేరుకుని మంటల్లో చిక్కుకున్న మత్స్యకారులకు ప్రథమ చికిత్స అందించి రక్షించినట్లు కోస్ట్‌గార్డ్‌ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మరో ఐదుగురి శరీర భాగాలు 30 శాతంపైగా కాలిపోయాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు కేజీహెచ్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

'అందరూ సేఫ్​ -మత్స్యకారుల ఆచూకీ లభ్యం' - Boat Missing Location Available

Fishing Community Protest CM Jagan :సీఎంజగన్ అధికారంలోకి వచ్చాక మత్స్యకారుల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయని మత్స్యకార సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ముంబయి తాజ్ హోటల్ ఘటన తరువాత గస్తీ కోసం ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్లను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బోట్లలో జీపీఎస్‌, ఇతర ఫైర్ సేఫ్టీ వస్తువులకు 50 నుంచి 70 శాతం రాయితీ ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కేవలం మత్స్యకార భరోసా పేరుతో జగన్‌ ప్రభుత్వం చేతులు దులుపేసుకుందని మత్స్యకార సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Chandrababu Response Boat Accident :మత్స్యకార బోటు ప్రమాదంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరా తీశారు. జిల్లా పార్టీ నేతలతో మాట్లాడి బాధితుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details