ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడి కత్తి కేసు మరోసారి వాయిదా - జగన్ రాకపోవడమే కారణమన్న లాయర్ - KODI KATHI CASE

విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో విచారణకు హాజరైన నిందితుడు శ్రీనివాస్‌ - లాయర్‌ అబ్దుల్‌ సలీంతో కలిసి విచారణకు హాజరైన శ్రీనివాస్‌

Kodi_Katti_Case
Kodi Kathi Case (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2025, 5:34 PM IST

Updated : Jan 24, 2025, 6:03 PM IST

Kodi Kathi Case: కోడి కత్తి కేసు విచారణను విశాఖ ఎన్‌ఐఏ కోర్టు మరోసారి వాయిదా వేసింది. విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ కోర్టుకు నిందితుడు శ్రీనివాస్‌ తన లాయర్ అబ్దుల్‌ సలీంతో కలిసి హాజరయ్యాడు. ఫిర్యాదుదారుగా ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కోర్టుకు రాకపోవడంతో విచారణ ఫిబ్రవరి 21వ తేదీకి వాయిదా పడినట్లు లాయర్ సలీం తెలిపారు. మూడేళ్లుగా సాక్ష్యం చెప్పేందుకు జగన్‌ కోర్టుకు హాజరుకాకపోవడంతో కేసు ముందుకు కదలడం లేదని విశాఖ దళిత సంఘం (విదసం) నేత వెంకట్రావు ఆక్షేపించారు. వాయిదాలకు గైర్హాజరైతే కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నట్లుగా పరిగణించాలని కోరారు. శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరై ఏడాది కావొస్తోందని తెలిపారు.

Last Updated : Jan 24, 2025, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details