ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నాన్న ఎక్కడ - ఎప్పుడొస్తారు ?' - అమ్మను ప్రశ్నిస్తున్న దుర్గారావు పిల్లలు - Jagan Stone Attack Case - JAGAN STONE ATTACK CASE

CM YS Jagan Stone Attack Case: సీఎం జగన్‌పై రాయితో దాడి కేసులో పోలీసుల అదుపులోకి తీసుకున్న టీడీపీ నాయకుడు, ఆటోడ్రైవర్‌ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక, ఆయన కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. విజయవాడలోని సింగ్‌నగర్‌లో డాబాకొట్ల సెంటర్‌లోని ఓ బంకులో స్నేహితుడితో కలసి టీ తాగుతుండగా పోలీసులు వచ్చి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

CM YS Jagan Stone Attack Case
CM YS Jagan Stone Attack Case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 7:31 AM IST

Updated : Apr 18, 2024, 10:15 AM IST

'నాన్న ఎక్కడ - ఎప్పుడొస్తారు ?' - అమ్మను ప్రశ్నిస్తున్న దుర్గారావు పిల్లలు

CM YS Jagan Stone Attack Case :సీఎం జగన్ పై రాయి దాడి కేసులో తెదేపా నేత దుర్గారావు ను అదుపులోకి తీసుకోవటం కలకలం రేపుతోంది . సాయం కావాలని ఎవరైనా వస్తే తోడుగా ఉండే వ్యక్తి ని పోలీసులు అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమ్మా నాన్నను పోలీసులు చంపేస్తారా? :రెండు నెలల క్రితం వేముల దుర్గారావుటీడీపీలో చేరారు. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి చంద్రలిఖిత నాలుగో తరగతి, రెండో కుమార్తె తరుణి రెండో తరగతి చదువుతున్నారు. కుమారుడు నిఖిల్‌ సిద్ధార్థ్‌ ఎల్‌కేజీ చదువుతున్నారు. దుర్గారావు భార్య శాంతి అంగన్‌వాడీ ఆయాగా పని చేస్తోంది. తండ్రిని పోలీసులు పట్టుకెళ్లారని తెలిసిన నాటి నుంచి పిల్లలు అన్నం తినటం మానేశారు. "నాన్న ఎక్కడ? ఎపుడు వస్తారు? అమ్మా నాన్నను పోలీసులు చంపేస్తారా?" అని పిల్లలు అడుగుతుంటే సమాధానం చెప్పలేక తల్లి, బంధువులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఆటో నడిపి డబ్బులు తెస్తేనే పూట గడిచే ఆ కుటుంబం మంగళవారం రాత్రి నుంచి మంచినీళ్లు ముట్టలేదు. భర్త కోసం పిల్లలతో భార్య శాంతి పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది.

సీఎంపై దాడి కేసులో యువకులు అరెస్ట్‌ - సీపీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులు నిరసన - Attack on CM Jagan

ప్రతిపక్ష పార్టీలో చేరితే కేసులు బనాయిస్తారా? : టీడీపీలో చేరడమే ఆయన చేసిన తప్పా? తండ్రి కోసం పిల్లలు మంగళవారం రాత్రి నుంచి తిండి లేక అల్లాడుతున్నారని, ఈ కేసుకు సంబంధించి ఏ ఆధారాలు ఉన్నాయని, ఆయనను అదుపులోకి తీసుకున్నారని, భర్తను తనకు చూపించాలని దుర్గారావు భార్య శాంతి పోలీసులను డిమాండ్ చేసింది. తన భర్తకు ఈ కేసుతో ఏం సంబంధం ఉందని పోలీసులు తీసుకెళ్లారో? సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తుంది. ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎక్కడ ఉన్నాడు? అన్న విషయాలను కూడా పోలీసులు కుటుంబానికి కూడా చెప్పరా? ఆయన ఆచూకీ కోసం సింగ్‌నగర్‌ స్టేషన్‌కు వెళ్లామని, అక్కడ ఎవరూ సమాధానం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి ఆందోళన నిర్వహించారు. పోలీసులు దుర్గారావు బంధువులను అడ్డుకున్నారు. దీంతో దుర్గారావు భార్య రోడ్డుపై బైఠాయించడంతో వెంటనే పోలీసులు వారిని బలవంతంగా ఆటోలో నార్త్ జోన్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు.

మా పిల్లలు ఎక్కడ ? - వదిలిపెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: వడ్డెర కాలనీ వాసులు - cm jagan stone pelting case

కాలనీవాసులకు చేదోడువాదోడుగా :ఐటీఐ చదివిన దుర్గారావు అందరికీ సాయం చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ కాలనీలో అందరికీ తలలో నాలుకలా ఉండే వాడు. దీంతో తమకు ఏ కష్టం వచ్చినా కాలనీ వాసులు ఆయనకు చెప్పుకునేవారు. బీసీల కోసం పాటు పడుతూ టీడీపీ పథకాల పట్ల ఆకర్షితులై రెండు నెలల క్రితం టీడీపీలో చేరారు. అందరితో కలివిడిగా ఉండటంతో అందరూ అతని మాట జవ దాటేవారు కాదు. నాయకుడిగా ఎదగడం టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావుతో కలసి ఉండటంతో వైకాపా నేతలు దుర్గారావును కేసులో ఇరికించారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జగన్​పై గులకరాయి దాడి కేసులో పురోగతి - పోలీసుల అదుపులో ఐదుగురు యువకులు - stone Attack on Jagan

Last Updated : Apr 18, 2024, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details