CM Chandrababu Rally in Hyderabad:ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు ర్యాలీగా బయల్దేరారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు తొలిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసం నుంచి భవన్ వరకు పార్టీ నేతలు, అభిమానులు ర్యాలీ చేపట్టారు. తొలుత బాణాసంచా కాల్చారు. ఆ తర్వాత బోనం ఎత్తారు. ర్యాలీ అనంతరం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం శ్రేణులు చంద్రబాబుకు సన్మానం చేశారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. తెలుగువారు గ్లోబల్ లీడర్స్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. 2047 నాటికి దేశం వికసిత భారత్‌గా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన అందులో తెలుగువారే ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపితే వైఎస్సార్సీపీ విధ్వంస పాలనతో తిరోమనంలో పడిందని చంద్రబాబు విమర్శించారు.
మూడంచెల విధానంతో విభజన సమస్యలకు పరిష్కారం- నిర్ణయించిన చంద్రబాబు, రేవంత్ సమావేశం - AP TELANGANA CMS MEETING
తెలంగాణ ప్రగతిలో ముందుందన్న చంద్రబాబు ఇబ్బందులను అధిగమించి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కాగా రెండ్రోజుల పాటు తెలంగాణ పర్యటనలో ఉన్న చంద్రబాబు రాష్ట్ర విభజన అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శనివారం సమావేశం అయ్యారు. అనంతరం ఇవాళ తెలంగాణ టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు భారీ ర్యాలీని నిర్వహించారు.
"నాలుగోసారి ప్రమాణం చేశాక తొలిసారిగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చాను. ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని వచ్చాను. మీ అభిమానం చూస్తుంటే నాకు ఉత్సాహం వస్తోంది. ఏపీలో నా విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారు. తెలంగాణ టీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు. తెలంగాణ గడ్డపై టీడీపీకి పునర్‌వైభవం వస్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నా రెండు కళ్లు. ఎన్టీఆర్ అనేక పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్. తెలంగాణలో అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీ వదల్లేదు. పార్టీ నుంచి నాయకులు వెళ్లారు కానీ కార్యకర్తలు వెళ్లలేదు. తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుంది."- సీఎం చంద్రబాబు
కీలక ప్రాజెక్టులపై పరస్పర సహకారం- చంద్రబాబు మార్గదర్శకత్వం తెలుగు ప్రజలకు ఎంతో అవసరం: రేవంత్ - Chandrababu and Revanth Meeting