ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బ్రేకింగ్ ది సైలెన్స్' - 2030 నాటికి దాని అంతమే లక్ష్యం: సీఎం చంద్రబాబు - CM CHANDRABABU ON AIDS PREVENTION

2030 నాటికి ఎయిడ్స్‌ అంతం లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడి - ఎయిడ్స్ నివారణ దినోత్సవంలో భాగంగా 'బ్రేకింగ్ ది సైలెన్స్' నినాదం

CM_Chandrababu_on_AIDS_Prevention
CM Chandrababu on AIDS Prevention (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2024, 10:25 PM IST

CM Chandrababu on AIDS Prevention: ఎయిడ్స్ నివారణ దినోత్సవంలో భాగంగా 'బ్రేకింగ్ ది సైలెన్స్' నినాదంతో 2030 నాటికి ఎయిడ్స్‌ అంతం లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 3.25 లక్షల మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నారన్నారు. యువతలో అత్యధికంగా కొత్త కేసులు నమోదవుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి 50 కిలో మీటర్లలోపు లింక్ ఆర్ట్ కేంద్రాలతో అవగాహనతో పాటు, అందుబాటులో ఉన్న చికిత్స ఎంతో ముఖ్యమని చెప్పారు. కళంకం లేని ప్రపంచం కోసం మన నిబద్ధతను పునరుద్ధరిద్దామని, అందరికీ ఆరోగ్యం, గౌరవాన్ని భరోసా ఇద్దామని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details