CM Chandrababu Naidu Meeting With HODs :రాష్ట్రంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా పని చేయాలనీ మంత్రులు, హెచ్ఓడీలు, కార్యదర్శులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో 12 లక్షల మంది దుర్భరమైన పేదరికంలో ఉన్నట్టు సమావేశంలో సీఎం పేర్కొన్నారు. పేదరికం నుంచి ప్రతి ఒక్కరిని బయటపడేలా 4పీని అమలు చేయాలనీ సూచించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి నిధులు రాబట్టే అంశాలపై సచివాలయంలోని ఐదో బ్లాక్లో మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో ఆయన సమావేశం అయ్యారు. ప్రభుత్వ సమీక్షలన్నీ నిర్దేశిత సమయంలోగానే పూర్తి అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు వినూత్న ఆలోచనలు చేయాలని ఆదేశించారు.
పర్యావరణ లక్ష్య సాధనకు ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం: మంత్రి పవన్ కల్యాణ్ - Pawan Kalyan on Visakha Pollution
కేంద్ర పథకాలను అధ్యయనం చేయాలి :ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పరిపాలనపై దృష్టి పెట్టాలన్న చంద్రబాబు, కేంద్రం నుంచి వచ్చే ఏ ఒక్క రూపాయిని వదలకుండా పూర్తి స్థాయిలో కేంద్ర పథకాలను అధ్యయనం చేయాలని వెల్లడించారు. మూస ధోరణిలో కాకుండా వినూత్నంగా ఆలోచన చేయాలని అన్నారు. పరిపాలనలో భాగంగా అధికారులరు తన వైపు నుంచి 100 శాతం మద్దతు ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. అధికారులకు వీలైనంత వరకు హ్యాండ్ హోల్డింగ్ అందిస్తామని తెలిపారు.
పోలవరం పనులు వెనకబడటానికి కారణం జగన్: మంత్రి నిమ్మల - Ministers Fires on Jagan
సమీక్షలకు స్వస్తి :అధికారులెవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే తాను కఠినంగా ఉంటానని చంద్రబాబు వెల్లడించారు. పేదరికం లేని సమాజ స్థాపనే తమ లక్ష్యంగా పని చేయాలని సీఎం సూచించారు. గంటల తరబడి సమీక్షలకు తాను స్వస్తి పలికానన్న సీఎం, అధికారులు కూడా రిజల్ట్ ఒరియేంటెడ్ పద్దతిలో సమీక్షలు చేపట్టాలని సూచించారు.
"పాలకుడు ఎలా ఉండకూడదో గత ఐదేళ్లలో చూశాం- మద్యం సొమ్మంతా వైఎస్సార్సీపీ నేతల జేబుల్లోకి వెళ్లింది" - excise department white paper