CM Chandrababu on SC Categorisation :వర్గీకరణ అమలు ద్వారా దళిత ఉపకులాలకు సమాన అవకాశాలు దక్కుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. జనాభా దామాషా పద్ధతిలో జిల్లా యూనిట్‌గా వర్గీకరణ అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ కోసం చేపట్టాల్సిన చర్యలపై ఎన్డీఏ కూటమి పార్టీల్లోని దళిత ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం విద్య ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కల్పించటం ద్వారా సమగ్ర దళిత అభివృద్ధి జరుగుతుందని అన్నారు.
ఎవరికీ అన్యాయం జరగకుండా అమలు :జనాభా దామాషా పద్దతిన జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై దళిత ఎమ్మెల్యేలతో సీఎం సచివాలయంలో సమావేశమయ్యారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై సీఎం చర్చించారు. సమైక్య రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేశామని న్యాయ సమస్యలతో అప్పట్లో ఆ కార్యక్రమం నిలిచిపోయిందని గుర్తు చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వర్గీకరణ అమలుకు వివిధ రాష్ట్రాలు సిద్ధమయ్యాయని, రాష్ట్రంలోనూ ఎవరికీ అన్యాయం జరగకుండా అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం కమిషన్ వేయనున్నట్లు తెలిపారు.
చంద్రబాబు తీసుకొచ్చిన చట్టం వల్లే న్యాయం బతికింది: మందకృష్ణ - Manda Krishna Special thanks to cbn