ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

72 గంటల్లోనే హామీ నెరవేర్చిన సీఎం - దివ్యాంగ యువకుడి ఇంట్లో ఆనందం - ELECTRICAL AUTO TO DISABLED MAN

కృష్ణాజిల్లాలో పర్యటన సందర్భంగా ఓ దివ్యాంగ యువకుడికి రేషన్​కార్డు, ఎలక్ట్రికల్‌ ఆటో ఇవ్వాలన్న సీఎం - 72 గంటల్లో అందజేత

CM Chandra babu Fulfilled His Promise On Krishna District Tour
CM Chandra babu Fulfilled His Promise On Krishna District Tour (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 21 hours ago

CM Chandra babu Fulfilled His Promise On Krishna District Tour : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాటను మరోసారి నిలబెట్టుకున్నారు. శుక్రవారం కృష్ణా జిల్లాలో పర్యటన సందర్భంగా ఓ దివ్యాంగ యువకుడికి రేషన్​కార్డు, ఎలక్ట్రికల్‌ ఆటో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు కేవలం 72 గంటల వ్యవధిలోనే సీఎం హమీనీ కార్యాచరణలోకి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా నేడు వాటిని అందజేశారు.

”సార్‌, నేను ఆటోడ్రైవర్‌ని. మీరు సీఎంగా గెలిస్తే నాకు రేషనుకార్డు, దివ్యాంగ ఫించను ఇస్తారని జగన్‌ అభిమానితో శపథం చేశాను. మీరు సీఎం అయ్యాకనే జనం ముఖాల్లో నిజమైన నవ్వులు చూస్తున్నా" అని కృష్ణా జిల్లా ఈడ్పుగల్లు చెందిన నువ్వుల సాయి కృష్ణా అనే వికలాంగ యువకుడు ఈనెల 20వ తేదీన సీఎం పర్యటన సందర్భంగా చంద్రబాబు ఎదుట చక్కగా మాట్లాడి ఆకట్టుకున్నాడు.

చంద్రబాబు ఓపిక ఆశ్చర్యపరుస్తోంది - సీఎం నాయకత్వంలో పని చేయడం సంతోషం : పవన్​ కల్యాణ్​

దీంతో స్పందించిన చంద్రబాబు వెంటనే అధికారులకు తన కోరిక తీర్చాలని ఆదేశించారు. చంద్రబాబు ఆదేశంతో నువ్వుల సాయి కృష్ణా తన జీవనాధారానికి కోసం అడిగిన ఎలక్ట్రిక్‌ ఆటోను వెంటనే అధికారులు మంజూరు చేశారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ చేతుల మీదుగా వాటిని అందించారు. దీంతో దివ్యాంగ యువకుడి కుటుంబం ఆనందోత్సాహంలో మునిగిపోయింది.

"సీఎం చంద్రబాబుతో మాట్లాడిన తరువాత నాకు ఎలక్ట్రికల్ ఆటో ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ ఆధ్యర్యంలో రూ. 3 లక్షల 50వేల ఆటోని ఇచ్చారు. చాల సంతోషంగా ఉంది. సీఎం నా బాధను అర్థం చేసుకుని ఆటో ఇస్తే కొంత మంది పెయిడ్ ఆర్టిస్టులు అనే కామెంట్లు పెట్టడం బాధగా ఉంది. నాకు ఆటో అందుతుందని సీఎం హమీ ఇచ్చినప్పుడు ఇతర పార్టీల వారు తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు నేను ఆటో చెంతనే నిల్చొని తీసుకున్న దృశ్యాలు, ఫొటోలను చూసైనా వారు కళ్లుతెరవాలని కోరుతున్నా." - నువ్వుల సాయికృష్ణ, సీఎం సహాయం పొందిన వ్యక్తి

నవంబర్ నుంచి ప్రాధాన్య క్రమంలో అన్ని ప్రాజెక్టుల మరమ్మతులు : మంత్రి నిమ్మల

'ఏపీలో విశ్వవిద్యాలయాలన్నింటికీ ఒకే చట్టం - వర్సిటీల ర్యాంకింగ్​ మెరుగుదలకు ఐదేళ్ల ప్రణాళిక' - CM Review on Higher Education

ABOUT THE AUTHOR

...view details