CM Chandrababu Tweet On 6 Months Of NDA Alliance Governance : ఆరు నెలల పాలనపై సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచిందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన గత ఐదేళ్ల కాలాన్ని ప్రజలు ఒక పీడకలగా భావించారని, సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు తాను, తన మంత్రివర్గ సహచరులు కృషి చేస్తున్నామన్నారు. ఈ ఆరు నెలల్లో గాడితప్పిన వ్యవస్థల్ని సరిదిద్దామని పేర్కొన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టామన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టామని తెలిపారు. 'రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్' అనే నినాదంతో ప్రతిక్షణం ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నామన్నారు. చేయాల్సింది ఎంతో ఉందనే బాధ్యతను గుర్తించుకొని ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజల ఆశీస్సులు, భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర - 2047 విజన్‌తో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ వన్‌గా నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు.
పల్లెప్రగతి పనుల్లో జాప్యంపై సీఎం ఆగ్రహం - ఆ చిన్నారులకు పింఛన్ ఇవ్వాలని ఆదేశాలు