ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటర్లు చైతన్యవంతులై రాజకీయాలను మార్చాలి - ముగిసిన సీఎఫ్​డీ కళాజాత కార్యక్రమాలు - State Level Kalajata Programmes

Citizens for Democracy State Level Kalajata Programmes Ended: సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర స్థాయి కళాజాత కార్యక్రమం కర్నూలులో ముగిసింది. ఈ కార్యక్రమంలో కళాకారులు నిర్వహించిన నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

citizens_for_democracy
citizens_for_democracy

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 8, 2024, 10:44 PM IST

Citizens for Democracy State Level Kalajata Programmes Ended:సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (Citizens for Democracy) ఆధ్వర్యంలో కర్నూలులోని లలిత కళా సమితిలో రాష్ట్ర స్థాయి కళాజాత ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ప్రజా సాంస్కృతిక వేదికపై నిర్వహించిన నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కళాజాత కార్యక్రమాలు శ్రీకాకుళంలో ఫిబ్రవరి 25న ప్రారంభమై నేడు కర్నూలు వేదికగా ముగిశాయి.

రాష్ట్రాన్ని భ్రఘ్ట పట్టించేందుకే వాలంటీర్​ వ్యవస్థ : వల్లెంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి

ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ హైకోర్టు న్యాయమూర్తి జి. భవానీ ప్రసాద్, రాష్ట్ర పూర్వ ఎన్నికల అధికారి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, కర్నూలు మాజీ కలెక్టర్ రాంశంకర్ నాయక్, కర్నూలుకు చెందిన విజయభారతి, చంద్రశేఖర్ కల్కూర, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి లక్ష్మణ రెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్(Nimmagadda Ramesh Kumar) మాట్లాడుతూ ప్రతి ఓటరు ఓటు విలువను తెలుసుకొని జవాబు దారిగా పనిచేసే వ్యక్తి అధికారంలోకి వస్తారని తెలిపారు. విద్యావంతులు ఓటు అనేది ఒక బాధ్యతగా గుర్తించుకోవాలని అన్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో జరిగిన ఎన్నికలలో తక్కువ శాతం ఓట్లు పోలవడాన్ని విద్యావంతులు గుర్తించాలని అన్నారు.

ఏపీలోనే అత్యధిక ఎన్నికల వ్యయం- అధికార పార్టీ అక్రమాలకు అంతేలేదు: CFD

ఎన్నికల్లో విద్యావంతులే ఓటు వేయకపోతే ఇక సామాన్యులు ప్రజలు ఎలా వేస్తారని ప్రశ్నించారు. అందువల్ల రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఈ కళాజాత కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. రాజకీయ నాయకులు ప్రజల మనసులను గెలవాలని సూచించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికాపంలోకి వచ్చిన దగ్గర నుంచి పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్నాయని అన్నారు.

తెలంగాణలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఎక్కడా రీపోలింగ్ జరగలేదని అన్నారు. ఏపీలో కూడా అదే విధంగా జరగాలని కోరారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా అవకతవకలు జరిగాయని అన్నారు. తిరుపతి అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో 35 వేల దొంగ ఓట్లు నమోదు కావడం ఇందుకు నిదర్శనమని నిమ్మగడ్డ తెలిపారు. ఓటు వెయ్యకుంటే మీకు సంక్షేమ పథకాలు రద్దు అవుతాయని వాలంటీర్లు చెప్పడం సరికాదన్నారు.

ఏపీలో ప్రభుత్వం,పార్టీ మద్య తేడా లేదు- ఎన్నికల అక్రమాలకు రాష్ట్రం ఓ యూనివర్శిటీ : నిమ్మగడ్డ రమేష్

ఓటర్లు చైతన్యవంతులుగా మారి రాజకీయాలను మార్చాలి:చట్టసభలు జరగాల్సిన విధంగా జరగటం లేదని అన్నారు. సభలు జరిగినప్పుడు నిరంతరం గొడవలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెట్టటం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులలో ఓటర్లు చైతన్యవంతులుగా మారి ఈ రాజకీయాలను మార్చాలని అన్నారు.

అలాగే ప్రజలకు సేవ చేసేందుకు పెట్టుకున్న వాలంటరీ వ్యవస్థను జగన్ తన ఎన్నికలకు సైన్యంగా వాడుకోవడం దారుణమన్నారు. వాలంటీర్​లను ప్రజాప్రతినిధులు తమ కార్యక్రమాల్లో వైసీపీ కార్యకర్తలని చెబుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకే వాలంటీర్​ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని వెల్లడించారు. ఇలాంటి వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details