Citizens for Democracy Meeting in Vijayawada:ప్రజాస్వామ్య భావాలు అంతర్గతంగా ప్రజల్లో ఎప్పుడూ ఉంటాయని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ (Nimmagadda Ramesh Kumar) అన్నారు. విజయవాడలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పటిష్ఠంగా అమలు చేస్తేనే ప్రజాస్వామ్యం పటిష్టవుతుందని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం ఇప్పుడు చాలా ముఖ్యమని తెలిపారు. ప్రతిపక్షాలు వారు అని కొంతమందికి ఓటుహక్కు ఇవ్వకుండా అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అని అన్నారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదు- వెంటనే స్పందించిన అధికారులు
చట్టంలో ఉన్న హేతుబద్దతను బట్టి న్యాయ స్థానాల్లో తీర్పులు ఉంటాయన్నారు. మీ ఓటును మీరు రక్షించుకుని వినియోగించుకోవాలని కోరారు. చట్ట సభలు ప్రమాణాలు పెంచేలా ఉండాలి కానీ అలా జరగడం లేదన్నారు. నియమ నిబంధనలు పాటించకుంటే, విలువలు ఎక్కడ ఉంటాయన్నారు. రాజ్యాంగంపై కనీస అవగాహన ఎంతమంది ప్రజాప్రతినిధులకు ఉందని ప్రశ్నించారు. అధికారులు కూడా నిబంధనలు మేరకు పనిచేయకుండా రాజకీయ నాయకులకు అండగా ఉంటున్నారని అన్నారు. స్థానికంగా నివాసం ఉండటం లేదని వ్యక్తుల ఓట్లను తొలగిస్తారా అని ప్రశ్నించారు. ఇటువంటి ఘటనలు దేశంలో ఎక్కడా లేవని కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలోనే చూశామన్నారు.
'ఏపీలో త్వరలో నిశ్శబ్ద విప్లవం రాబోతోంది'- 'ఓటు వేద్దాం- ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేద్దాం'
Justice Chalameswar:రాజ్యాంగం వల్ల ఓటు ద్వారా ఎన్నికై చట్ట సభల్లో అడుగు పెడుతున్నారని సుప్రీంకోర్టు పూర్వపు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ వ్యాఖ్యానించారు. దురదృష్టవశాత్తు యాభై ఏళ్ల పాటు సుప్రీంకోర్టులో చట్టం ద్వారా ఓటు ప్రక్రియ వచ్చిందని అన్నారు. ఓటుకు సంబంధించిన హక్కు కేవలం చట్టం ద్వారా వచ్చిందని ఎలా చెబుతారని ఓటు వేయడానికి కచ్చితంగా రాజ్యాంగపరమైన హక్కు ఉందని అన్నారు. ఓటు హక్కును ప్రజలు ఎలా వినియోగించు కుంటున్నారనేది మన దేశంలో సమస్య అని తెలిపారు. నేడు అన్ని పార్టీలు అధికారం కోసం అనాలోచితంగా హామీలు ఇస్తున్నారన్నారు. ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావన్నారు.
పోలీసు వ్యవస్థ రాజకీయ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయింది : సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ
ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నిక కావాలంటే కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యం బతకాలంటే ముందు ప్రజల్లో చైతన్యం రావాలని సూచించారు. మనం సరిదిద్దుకోక పోతే మంచి భవిష్యత్తు ఉండదన్నారు. వ్యక్తిగత స్వలాభం వ్యవస్థలకు చేటు తెస్తుందన్నారు. ఇప్పుడు బాగున్నా పిల్లలు భవిష్యత్తు అంధకారంగా మారుతుందని సూచించారు. న్యాయ వ్యవస్థతో సహా అన్ని అన్ని వ్యవస్థలు సొంతంగా ఆలోచన చేయాలి, పని చేయాలన్నారు. న్యాయం, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని లేదంటే ఆ దుష్ఫలితాలను తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. మారుతున్న సమాజంతో కొన్ని మార్పులు అనివార్యమన్నారు. కానీ మూల విధానాలు, నిబంధనలు అలాగే ఉంటాయన్నారు.
ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి- ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి : నిమ్మగడ్డ