ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ బెవరేజెస్‌ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు - CID Raids at Vasudeva Reddy House

CID Raids at Vasudeva Reddy House: ఏపీ బెవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని వాసుదేవరెడ్డే ముందుండి నడిపించారని ఆరోపణలున్నాయి.

CID_Raids_at_Vasudeva_Reddy_House
CID_Raids_at_Vasudeva_Reddy_House (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 7, 2024, 3:54 PM IST

Updated : Jun 7, 2024, 4:00 PM IST

CID Raids at Vasudeva Reddy House: ఏపీ బెవరేజెస్‌ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలోని నివాసంలో ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. జగన్‌ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని వాసుదేవరెడ్డిపై ముందుండి నడిపించారని ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వైస్సార్సీపీకి కరడుగట్టిన మద్దతుదారుగా పనిచేశారని ఆయనపై గతంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. నూతన మద్యం విధానం పేరుతో వైస్సార్సీపీ నేతలకు అనుచిత లబ్ధి కలిగించేలా వాసుదేవరెడ్డి వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏపీలో జే-బ్రాండ్‌ మద్యం తీసుకురావడంతో పాటు డిస్టిలరీలన్నీ అనధికారికంగా వైస్సార్సీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంలో ఆయనదే కీలకపాత్ర. జే-బ్రాండ్‌ మద్యం ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించిన ఘనత వాసుదేవరెడ్డిదేనని పలు ఆరోపణలు ఉన్నాయి.

ఏపీ బెవరేజెస్‌ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు (ETV Bharat)
Last Updated : Jun 7, 2024, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details