CBI Arrest Kakinada Port Customs Superintendent Officers :కాకినాడ పోర్ట్ కస్టమ్స్ సూపరిండెంట్ ఓ కార్గో సంస్థ ప్రతినిధి నుంచి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కారు. విశాఖ సీబీఐ యూనిట్ అధికారులు లంచం తీసుకున్న శ్రీనివాసు, లంచం ఇచ్చిన శ్రీ చంద్ర కార్గో సంస్థ ప్రతినిధి పంతం భరత్ కుమార్ను అరెస్ట్ చేసి సీబీఐ కోర్టులో హాజరపరిచింది. సూపరింటెండెంట్ శ్రీనివాస్ నుంచి రూ. 3,18,200 అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అధికారులు పోర్ట్ కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ నుంచి రూ. 22.74 లక్షలు, ఇతర కస్టమ్స్ అధికారుల నుంచి రూ.5 లక్షలను మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ అధికారులు వారికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు.
సీబీఐ వలలో కాకినాడ కస్టమ్స్ అధికారులు - సికింద్రాబాద్లో పట్టివేత - CBI Arrest Customs Superintendent
CBI Arrest Kakinada Port Officers : లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కాకినాడ పోర్ట్ కస్టమ్స్ సూపరింటెండెంట్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2024, 2:33 PM IST
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అసిస్టెంట్ కమిషనర్, ఇతర కస్టమ్స్ సిబ్బంది వేరే చోటుకి ప్రయాణానికి సిద్ధమవుతున్న తరుణంలో స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో అనుమానితులైన వారి ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేసినట్లు పేర్కొన్నారు. విశాఖ సీబీఐ యూనిట్లోని అవినీతి నిరోధక విభాగం (Anti Corruption Department) బృందాలు ఈ సోదాలు నిర్వహించినట్లు విశాఖ సీబీఐ ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో మరికొందరు ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగుల హస్తం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను విశాఖలోని సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎదుట ఆదివారం హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. వారిని న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు తెలియజేశారు.
విశాఖ డ్రగ్స్ కంటెయినర్ కేసు - కన్పించని పురోగతి? - Visakhapatnam Drugs Container Case