BSNL Sell Properties in AP :టెలికాం రంగంలో ఒకప్పుడు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వెలుగు వెలిగింది. కానీ ఇప్పుడు ఆ సంస్థకి చెందిన ఖాళీ స్థలాలు విక్రయించేందుకు, భవనాలు అద్దెకిచ్చేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా స్థలాలు, ఖాళీ భవనాలను బీఎస్ఎన్ఎల్ గుర్తించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఒక చోట ఖాళీ స్థలం, మిగతా చోట్ల 470 భవనాలు ఉన్నాయి.
5జీ సేవలు అందించేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధమవుతోంది. ఇందుకోసం భారీగా పెట్టుబడులు అవసరం. మొదటగా నిరుయోగంగా ఉన్న తమ సంస్థ స్థలాలు విక్రయించడం ద్వారా కొన్ని వనరులు సమకూర్చుకోవాలని భారత్ సంచార్ నిగం లిమిటెడ్ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని బ్యాంకు కాలనీలోగల 1.65 ఎకరాల స్థలాన్ని అమ్మకానికి ఉంచారు. దీని ప్రాథమిక విలువ రూ.12.94 కోట్లుగా నిర్ణయించారు. ఈ క్రమంలో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు ఆహ్వానించారు. వివిధ జిల్లాల్లోగల 470 బీఎస్ఎన్ఎల్ భవనాల్లో ఉన్న ఖాళీ స్థలాన్ని అద్దెకు ఇవ్వనున్నారు. వీటిలో కొన్ని ఫ్లోర్లు, గదులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించి నోటిఫికేషనన్ జారీ చేశారు.
5G సేవలను ఎప్పుడు ప్రారంభించొచ్చు?:ది హిందూ నివేదిక ప్రకారంవచ్చే సంవత్సంర సంక్రాంతి నాటికి బీఎస్ఎన్ఎల్ తన 5జీ సేవలను ప్రారంభించొచ్చు. దీనిపై కృష్ణా జిల్లా బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ (పీజీఎం) ఎల్. శ్రీను మాట్లాడుతూ 4జీ సేవలను తదుపరి స్థాయికి అప్‌గ్రేడ్ చేసి నాణ్యమైన సేవలను అందించేందుకు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. దీనిలో భాగంగా టవర్లు, ఇతర పరికరాలను కంపెనీ అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.