Boat Removal at Prakasam Barrage :ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు తొలగింపు ప్రక్రియ అందర్ని ముప్పుతిప్పలు పెడుతోంది. నాలుగు రోజులుగా విస్తృతంగా బోట్ల వెలికితీతప్రక్రియ విస్తృతంగా సాగుతోంది. బోట్లను బయటకు తెచ్చేందుకు మూడు రోజలు అధికారులు, డైవింగ్ టీమ్ ఎంతో కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. అందుకే బోట్లను బయటకు తెచ్చేందుకు అందులో నిపుణుడైన అబ్బులు బృందాన్ని సైతం ప్రత్యేకంగా కాకినాడ నుంచి తీసుకు వచ్చారు.
బెకెమ్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖకు చెందిన అబ్బులు బృందం వేగంగా పనులు చేస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో 18 అడుగుల దిగువన రెండు బోట్లు చిక్కుకున్నాయి. బోట్లు ఒకదానికొకటి ముడి పడి ఉండటంతో ప్రక్రియ క్లిష్టంగా మారింది. శుక్రవారం సాయంత్రం బోట్లను కలిపివున్న చిక్కుముడిని బెకెమ్ సంస్థ విడదీసింది. బ్యారేజ్ నుంచి 200 మీటర్ల దూరం వరకు బోట్లను లాగేందుకు పొక్లెయిన్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ ఒక బోటును బయటకు తెస్తామని అధికారులు తెలిపారు.
Prakasam Barrage Boat Incident :ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ వరుసగా మూడోరోజూ కొనసాగింది. గేట్ల వద్ద చిక్కుకున్న నాలుగు భారీ పడవలను బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. రంగంలోకి దిగిన కాకినాడకు చెందిన పడవలను వెలికితీసే నిపుణుడు అబ్బులు నేతృత్వంలోని 14 మంది బృందం భారీ బోట్లు బయటకు లాగే ఏర్పాట్లు చేసింది. ఒక్కొకటి 50 టన్నుల పైగా బరువులాగే 7 భారీ పడవలతో రెస్క్యూ ఆపరేషన్ చేశారు.