ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్పీకర్‌ పదవికి ఒకే ఒక్క నామినేషన్ ​- అయ్యన్న ఎన్నిక లాంఛనమే - Ayyanna Patrudu became Speaker

Ayyanna Patrudu Became Speaker of Assembly was Unanimous : అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. స్పీకర్‌ పదవి కోసం ఒకే ఒక నామినేషన్‌ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. గడువులోగా ఒకే ఒక నామినేషన్‌ రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు.

Ayyanna Patrudu Became Speaker of Assembly was Unanimous
Ayyanna Patrudu Became Speaker of Assembly was Unanimous (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 6:04 PM IST

Updated : Jun 21, 2024, 10:26 PM IST

Ayyanna Patrudu Became Speaker of Assembly was Unanimous : ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ పదవి కోసం ఒకే ఒక నామినేషన్‌ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీలో సీనియర్‌ నేతగా కొనసాగుతున్న అయ్యన్న కూటమి ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్‌. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఏడాది 1983లో తొలిసారి నర్సీపట్నం నుంచి విజయం సాధించారు. ఇప్పటి వరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగానూ విజయం సాధించారు. పలుశాఖలకు మంత్రిగా పనిచేశారు. గతంలో కంటే ఈసారి 24,756 ఓట్ల మెజార్టీతో నర్సీపట్నం ప్రజలు గెలిపించారు.

తొలిరోజు సందడిగా శాసన సభ- చంద్రబాబు, పవన్​, జగన్​ ఎలా స్పందించారంటే! - AP Assembly Sessions 2024

స్పీకర్‌ పదవి కోసం నామినేషన్‌ దాఖలు : ఏపీ శాసనసభ స్పీకర్‌ పదవి కోసం తెలుగుదేశం పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ఈరోజు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున కూటమి నేతలు నామినేషన్‌ పత్రాలను శాసనసభ కార్యదర్శికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్ పాల్గొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌ ఎన్నిక నిర్వహించనున్నారు.

42 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నో పదవులు : అయితే ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పదవి ప్రమాణ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చూసానని, ప్రస్తుతం స్పీకర్‌ పదవి దక్కడం అరుదైన విషయమని అన్నారు. 1983లో రాజకీయంలోకి ప్రవేశించానని, ఈ 42 ఏళ్ల ప్రయాణంలో పలుమార్లు మంత్రి పదవులను అలంకరించానని పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ , బీజేపీ నాయకులు తన పేరును సూచిస్తూ స్పీకర్‌ పదవికి నామినేషన్‌ వేయడం అభినందనీయమని అన్నారు.

అసెంబ్లీలో తడబడిన జగన్​ రెడ్డి- 'ఘోరఓటమి తరువాత ఇదే తొలిసారి - pulivendula mla ys jagan oath

నాకు గౌరవమైన పోస్టు ఇచ్చినందుకు గౌరవంగా మెలుగుతానని వెల్లడించారు. స్పీకర్‌ సీటులో కూర్చున తరువాత పార్టీ గుర్తుకు రావొద్దని అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేనప్పటికీ తాము అందరినీ గౌరవవిస్తామని స్పష్టం చేశారు.సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పిస్తానని, అవసరమైనే వారికి శిక్షణ కూడా ఇస్తామని తెలిపారు. ప్రజలు తమకు పదవులు ఇవ్వలేదని, బాధ్యత ఇచ్చారని, ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చుతానని అయ్యన్నపాత్రుడు అన్నారు.

'నిజాయితీ, నిక్కచ్చి వైఖరికి మారుపేరు'- డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతల స్వీకరణ

స్పీకర్‌ పదవికి ఒకే ఒక్క నామినేషన్ ​- అయ్యన్న ఎన్నిక లాంఛనమే (ETV Bharat)
Last Updated : Jun 21, 2024, 10:26 PM IST

ABOUT THE AUTHOR

...view details