Applications For New Liquor Shops In AP :ఏపీలో నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వ మద్యం షాపుల విధానానీకికు స్వస్తి పలికింది. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి.
రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణ మళ్లీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలన్న నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కాలపరిమితితో నూతన మద్యం విధానాన్ని (New Liquor Policy In AP) ఖరారు చేసింది. అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ ఈ విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నెల 12 మద్యం దుకాణాలు : నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. ఒక్కో దానికి 2 లక్షలు చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాలి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అందించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల 11న లాటరీ తీసి లైసెన్స్‌లు అందించనున్నారు. ఈ నెల 12 నుంచి లైసెన్సుదారులు కొత్త దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగిసింది. అయితే కొత్త దుకాణాలు ఏర్పాటు అయ్యే వరకు వీటినే కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
'రాష్ట్రంలో బీర్లు పుష్కలం - కొరతేమీ లేదు!' - No Shortage Of Liquor Stocks
ఆ స్టోర్లకు ఐదేళ్ల కాలపరిమితి :మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం నాలుగు శ్లాబుల్లో లైసెన్సు రుసుములు ఖరారు చేశారు. తొలి ఏడాది పది వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షలు, ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలుగా లైసెన్సు రుసుమును నిర్ణయించారు. రెండో ఏడాది ఈ రుసుములపై పది శాతం చొప్పున పెంచి వసూలు చేస్తారు. ఏటా ఆరు విడతల్లో లైసెన్సు రుసుము చెల్లించాలి. రిటైల్ వ్యాపారం చేసే లైసెన్సుదారుకు 20 శాతం మేర మార్జిన్ ఉంటుంది.