APCC Chief YS Sharmila Complaint to Governor :మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఖాళీ చెక్కులా అదానికీ రాసి ఇచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను 'అదానీప్రదేశ్'గా మార్చేశారని మండిపడ్డారు. రూ.1,750 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆధారాలతో సహా వ్యవహారం బయటకొస్తే జగన్ ఇప్పటివరకు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం వెళ్లి గవర్నర్ అబ్దుల్‌నజీర్‌కు జగన్ హయాంలో జరిగిన విద్యుత్తు ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
రాబోయే తరాన్ని కూడా తాకట్టు : ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతుందని, ప్రజలపై భారం పడుతుందని ఫిర్యాదు చేశారు. ఈ ఒప్పందం కోసం రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. వచ్చే 25 ఏళ్లపాటు ఒప్పందం అంటే, రాబోయే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్లేనని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే సెకితో అప్పట్లో గుజరాత్ ప్రభుత్వం కేవలం రూ.1.99 ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం రూ.2.49 చేసుకుందన్నారు. మొత్తంగా యూనిట్‌కి 5 రూపాయలు పడుతుందని, ఈ ఒప్పందం కారణంగా ప్రజలపై లక్షల కోట్ల భారం పడుతుందని ఫిర్యాదులో వెల్లడించారు.
కేంద్రం ఇచ్చే రాయితీ కొంతే - సెకి విద్యుత్‌కు ఐఎస్‌టీఎస్ ఛార్జీలు చెల్లించాల్సిందే!