AP SSC Results 2024: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్ధిని, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌అప్‌డేట్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మార్చి 18 నుంచి మార్చి 30 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలు 22వ తేదీ ప్రకటించనున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.
త్వరలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల - Telangana Inter Results Release
వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకునేలా ఏర్పాట్లు: రాష్ట్రంలో మార్చి18 నుంచి మార్చి 30 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 6 లక్షల 30 వేల 633 మంది విద్యార్థులు హాజరయ్యారు. 3 వేల 473 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షల ప్రక్రియ ముగిసిన వెంటనే అధికారులు మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించి ఈ నెల 8వ తేదీతోనే ముగించారు. మరోసారి జవాబు పత్రాల పరిశీలన, మార్కుల నమోదు, కంప్యూటీకరణ ప్రక్రియను సైతం ఇప్పుటికే పూర్తి చేశారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో స్టూడెంట్స్ ఫలితాలను చెక్ చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్‌ను పదో తరగతి పరీక్ష ఫలితాలపై ఇప్పటికే పలుమార్లు ఈటీవీ భారత్ ప్రతినిధి సంప్రదించారు.
పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఈ 10 టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ! - Exam Preparation Tips