HC on Anna Canteens Color Petition : అన్న క్యాంటీన్లకు టీడీపీ రంగులు వేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. రాజకీయ కారణాలతో పిటిషన్ వేశారని న్యాయస్థానం అభిప్రాయపడింది. గ్రామ సచివాలయలకు గతంలో బ్లూ కలర్ వేయటంపై ఇచ్చిన కోర్టు తీర్పు ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. బ్లూ కలర్ తొలగించాలని అందులో ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు.
అన్న క్యాంటీన్లకు గతంలో ఏ రంగు వేశారు? - రంగులు చూసి పార్టీని ఎలా నిర్ణయిస్తారు? : హైకోర్టు - HC ON ANNA CANTEENS COLOUR PETITION
అన్న క్యాంటీన్లకు టీడీపీ రంగులు వేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది

AP HC on Anna Canteens Colour Petition (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 16, 2024, 3:45 PM IST
రంగు ఆధారంగా పార్టీని ఎలా నిర్ణయిస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అన్నా క్యాంటీన్‌కు ఇంతకు ముందు ఏ రంగు వేశారని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 6 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
ప్రజలకు ప్రతిరోజూ రాజకీయ నేతల దర్శనం అవసరం లేదు: హైకోర్టు - AP HC on Illegal Hoardings