AP HC Rejected Borugadda Anil Bail Petition :సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో తనపై నమోదైన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ బోరుగడ్డ అనిల్ కుమార్ వేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. నిందితుడు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులే పనిగా పెట్టుకున్నారా? అని న్యాయస్థానం వాఖ్యానించింది. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్‌కు పూర్వ నేర చరిత్ర ఉందని పోలీసులు న్యాయస్థానానికి వివరించారు.
అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైందని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో బోరుగడ్డపై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Borugadda Anil Case Update :మరోవైపు వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో బోరుగడ్డ అనిల్ కుమార్ అరాచకానికి హద్దే లేకుండా పోయింది. పోలీసులు సైతం అతనివైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాడు. గుంటూరు నగరానికి చెందిన అనిల్ కేంద్రమంత్రిగా పని చేసిన రాందాస్ అఠావలె అనుచరుడిగా చెప్పుకుంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చలామణి అయ్యాడు. వైఎస్ జగన్‌ను అన్నా అని సంబోధిస్తూ తానూ పులివెందులకు చెందినవాడినేనంటూ వైఎస్సార్సీపీతో అంటకాగాడు.