ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రిటైర్డ్​ ఐపీఎస్ ఏబీవీ సస్పెన్షన్ కాలం క్రమబద్ధీకరణ - ప్రభుత్వ ఉత్తర్వులు - ABV SUSPENSION PERIOD REGULARIZED

విశ్రాంత ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించిన ప్రభుత్వం - సస్పెన్షన్‌ కాలానికి ఏబీవీకి చెల్లించాల్సిన మొత్తం వేతనం, అలవెన్సుల చెల్లింపునకు ఆదేశాలు

AB Venkateswara Rao
AB Venkateswara Rao (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2025, 3:24 PM IST

ABV Suspension Period Regularized: విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు ఇచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏబీవీపై రెండు దఫాలుగా జగన్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. 2020 ఫిబ్రవరి 2 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకూ మొదటి దఫా, రెండో విడతలో 2022 జూన్ 28 తేదీ నుంచి 2024 మే 30 తేదీ వరకూ మరోమారు సస్పెన్షన్ వేటు వేసింది.

ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఏబీవీపై నమోదైన అభియోగాలను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై నమోదైన అభియోగాలకు సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ విచారణను వెనక్కు తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏబీవీ ఉద్యోగ విరమణ చేయటంతో ఆయన రెండు విడతల సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా పేర్కొంటూ, ఆ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ కాలానికి ఏబీవీకి చెల్లించాల్సిన మొత్తం వేతనాన్ని, అలవెన్సులను చెల్లించాలంటూ ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. సస్పెన్షన్ వేటు పడకపోతే ఎంత మొత్తం ఇవ్వాలో ఆ మేరకు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదం :కాగావిశ్రాంతసీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొన్నేళ్లపాటు సస్పెన్షన్​లో ఉంచింది. ఈయన గత ఏడాది మే 31వ తేదీన పదవీ విరమణ చేశారు. అదే రోజు ఉదయమే సర్వీస్‌లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో ఏబీవీ 2024 మే 31వ తేదీన విధుల్లో చేరడం, సాయంత్రానికి పదవీ విరమణ చేయడం జరిగింది. చివరిగా ప్రింటింగ్‌, స్టేషనరీ అండ్‌ స్టోర్స్‌ పర్చేజ్‌ కమిషనర్‌గా ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్‌ ఇచ్చింది.

తన సస్పెన్షన్​ను సవాల్ చేస్తూ, తనను సర్వీసులోకి తీసుకోవాలంటూ ఏబీవీ న్యాయపోరాటం చేశారు. దీంతో ఏబీవీపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) మే 8వ తేదీన ఎత్తివేసింది. వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని ఆదేశిందించి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్యాట్ ఆదేశాలతో ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేశారు. బాధ్యతలు స్వీకరించిన రోజే విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఏబీ వెంకటేశ్వరరావు ఆ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు.

బాధ్యతలు స్వీకరించిన రోజే ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ - Government Orders on ABV Posting

అన్యాయం, అణచివేతపై పోరాడుతూనే ఉంటా: రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ - IPS ABV INTERVIEW

ABOUT THE AUTHOR

...view details