ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

17 మంది సభ్యులతో ఆర్టీసీ బోర్డు - నోటిఫికేషన్ విడుదల - GOVT NOTIFICATION TO SET RTC BOARD

ఆర్టీసీకి బోర్డును ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ - మొత్తం 17 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటు

Board_for_APSRTC
Board_for_APSRTC (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2025, 5:23 PM IST

Govt Issues Notification to Set up Board for RTC:ఏపీఎస్​ ఆర్టీసీకి బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. చైర్మన్ కొనకళ్ల నారాయణ సహా ఆరుగురు నామినేటెడ్ సభ్యులు, 11 మంది అధికారులతో ఆర్టీసీ బోర్డును ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్టీసీ ఎండీ, ఆర్థిక, రవాణా, సాధారణ పరిపాలన శాఖ, ఇతర శాఖలు, విభాగాల ఉన్నతాధికారులతో బోర్డును ఏర్పాటు చేసింది. బోర్డులో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం వహించేలా అధికారులు ఉండనున్నారు. రెండేళ్ల పాటు ఆర్టీసీ వ్యవహారాలను పర్యవేక్షించేలా బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details